అగ్నిప్రమాదం: రూ.4 లక్షల ఆస్తి నష్టం
జోగులాంబ గద్వాల: జిల్లాలోని రాజోలి గ్రామంలో అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఓ మటన్ షాపులో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో నాలుగు దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేసింది. రూ.4 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.