చచ్చి బతికినంతపనైంది!
మెల్ బోర్న్: ఆస్ట్రేలియాలో వూల్ వర్త్ అనే అతి పెద్ద సూపర్ మార్కెట్లో తెచ్చుకున్న ఆలుగడ్డలు తిని సచ్చిబతికనంతపనైంది ఓ భారతీయ మహిళకు. చివరకు కోలుకున్న ఆమె తనకు విషపూరిత ఆలుగడ్డలు అమ్మిన ఆ సూపర్ మార్కెట్‌కు కోర్టు ద్వారా నోటీసులు పంపించింది. న్యూక్యాజిల్ లో నివాసం ఉంటున్న రజ్ వీర్ కౌర్ గత ఏడాది ఏప్రిల్ నెలలో కొన్ని సిడ్నీలోని వూల్ వర్త్ మార్కెట్ లో ఆలుగడ్డలతోపాటు ఆహార పదార్థాలను కొనుగోలు చేసింది.
వాటితో కూర చేసుకొని భోజనం చేశాక అది కాస్త ఫుడ్ పాయిజన్‌గా మారి తీవ్ర అనారోగ్యానికి గురైంది. అనంతరం వారం రోజుల పాటు కోమాలోకి వెళ్లింది. కాలేయాన్ని కూడా మార్చాల్సిన అవసరం వచ్చింది. దీంతోపాటు ఆమె శరీరంలోని అంతర్గత అవయవాలన్నీ చాలా వరకు దెబ్బతిన్నాయి. ఎట్టకేలకు ఆమె నాలుగు నెలల తర్వాత కోలుకుని ప్రాణాలతో బయటపడింది. ఆ వెంటనే సదరు మార్కెట్‌కు నోటీసులు పంపించింది.