ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం
ఉత్తరప్రదేశ్: గోరఖ్‌పూర్‌లోని బీఆర్డీ ఆస్పత్రిలో నెల రోజుల వ్యవధిలో వందల సంఖ్యలో చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశ ప్రజల్ని తీవ్రంగా కలచివేసిన విషయం తెలిసిందే. ఈ దారుణం మరవకముందే మరో విషాద సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆగస్టు నెలలో ఫరూఖాబాద్‌లోని రామ్ మనోహర్ లోహియా జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్, మందుల కొరతతో సుమారు 49 మంది చిన్నారులు చనిపోయారని అధికారులు వెల్లడించారు. దీంతో చీఫ్ మెడికల్ ఆఫీసర్‌తో సహా మొత్తం మగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సీ దయానంద్ మిశ్రా తెలిపారు. ఆక్సిజన్ అందక చనిపోయిన పిల్లల్లో ఎక్కువగా అప్పుడే జన్మించిన వారే ఉండటం విశేషం.
జిల్లా మెజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ దర్యాప్తు బృదం ఆస్పత్రికి వెల్లడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై ఆస్పత్రి వర్గాలను జిల్లా మెజిస్ట్రేట్ సమగ్ర నివేదికను ఇవ్వాలని కోరారు. చిన్నారుల తల్లిదండ్రులు ఆక్సిజన్, మందుల సరఫరా కొరతపై ఫిర్యాదు చేశారు.