అలాంటి వాహనాలు వద్దు
ఢిల్లీ నగరంలో ఏడు సంవత్సరాలు దాటిన వాహనాలు రోడ్డు మీద సంచరించరాదని నిబంధన విధించడం ముదావహం. పాత వాహనాలు, ఫిట్నెస్ సరిగ్గా లేని వాహనాల నుంచి వెలువడే పొగ, దానితో సంభవించే వాయు కాలుష్యం ప్రజల ప్రాణాలతో చెలగాటమాతా యి. మరోవైపు అలాంటి పాత వాహనాల వల్ల అనేక మైన రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నా యి. మన రాష్ట్రంలో కూడా 15 సంవత్స రాలు దాటిన వాహనాలను రోడ్ల మీద తిరగనివ్వరాదనే నిబంధనను అమలు చేయాలని కోర్టులు ఆదేశాలు జారీ చేసి ఏళ్లు గడుస్తున్నా అమలుకు మాత్రం నోచుకోకపోవడం శోచనీయం.
కాలం చెల్లిన వాహనాలను పక్కకు పెట్టించే ప్రక్రియ నిరంతరం సాగవలసిందే. ముఖ్యంగా విద్యా సంస్థలు, ప్రైవేట్ పాఠశాలలు పాత వాహనాలను వినియోగంలో పెడుతూ అనేక సమస్యలను సృష్టిస్తు న్నాయి. దీనిని గమనించి యుద్ధప్రాతిపదికన ఇందుకు సంబంధించిన జీవోలను పటిష్టంగా అమలు చేయా ల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తవుటు రాంచంద్రం జగిత్యాల, కరీంనగర్ జిల్లా