నగరంలో సూది సైకో కలకలం
వనస్థలిపురం: నగరంలో మరో మారు సూది సైకో రెచ్చిపోయాడు. బైక్ పై వెళ్తున్న మహిళ పై సూదితో దాడి చేసి పరారయ్యాడు. ఈ సంఘటన వనస్థలిపురం పరిధిలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న రమాదేవి(38) అనే మహిళ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో గుర్తుతెలియని దుండగుడు సూదితో దాడి చేశాడు.
ఇది గుర్తించిన ఆమె కేకలు వేసే లోపే దుండగుడు అక్కడి నుంచి ఉడాయించాడు. సంఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ పుటెజ్ లను పరిశీలిస్తున్నారు. రమాదేవి ఓ కాలేజ్ లో వైస్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు.