రామహనుమాన్ ఆలయం దేవాదాయశాఖ స్వాధీనం
కర్నూలు(న్యూసిటీ): బళ్లారి చౌరస్తాలోని రామాంజనేయ స్వామి ఆలయాన్ని శనివారం దేవాదాయశాఖ స్వాధీనం చేసుకుంది. ఆ శాఖ ఉపకమిషనర్ బి.గాయత్రీదేవి ఆదేశాలనుసారం కర్నూలు గ్రూపు1 దేవాలయాల కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ స్వాధీనం చేసుకున్నారు. ఆలయంలో ఉన్న మూడు హుండీలను సీజ్ చేశారు. కార్యక్రమంలో అర్చకులు మారుతీ శర్మ, దేవాదాయశాఖ కార్యనిర్వాహణాధికారులు అనుమంతరావు, దినేష్, చంద్రశేఖరరెడ్డి, సుబ్రమణ్యంనాయుడు, కల్లూరు ప్రసాద్, వరదరాజులు పాల్గొన్నారు.