అనుమానాస్పదంగా మహిళ మృతి
కళ్యాణదుర్గం(అనంతపురం): అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మొదిగల్ గ్రామ సమీపంలో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతిచెందింది. గ్రామానికి చెందిన శివమ్మ(34) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఈ రోజు గ్రామ సమీపంలోని రామప్ప కొండపై అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మహిళ వంటిపై బట్టలు లేకపోవడంతో.. అత్యాచారం అనంతరం హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.