భారత్‌పై మరోసారి కాల్పులకు తెగబడిన పాక్
జమ్మూ కాశ్మీర్: పాక్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సాంబా, జమ్మూ జిల్లాలోని రామ్‌గర్, అర్నియా సెక్టార్లలో సైనిక శిబిరాలే లక్ష్యంగా పాక్ కాల్పులకు తెగబడింది. దీంతో భారత్ సైన్యం వెంటనే అప్రమత్తమైంది. భారత్ సైన్యం ఎదురు కాల్పులు జరిపి... పాక్ దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టింది.
పాక్ కాల్పుల్లో ఎవరికి ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కానీ సంభవించలేదని సైనిక అధికారులు వెల్లడించారు. గత అర్థరాత్రి ఒంటి గంటకు ఓ సారి.... గురువారం తెల్లవారుజామున 4.00 గంటలకు మరోసారి కాల్పులు జరిగాయిని చెప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ దీపావళి పండగను జమ్మూ కాశ్మీర్లో జరుపుకుంటున్నారు. అయితే ఈ రోజు ఉదయం ఆయన సియాచిన్ వెళ్లారు.