కిడ్నాప్ చేయబోయి.. దొరికిపోయింది
అనంతపురం: అనంతపురం జిల్లాలోని గుంతకల్లు మండలకేంద్రంలో యూకేజీ చదువుతున్న రమ్యచందన అనే నాలుగేళ్ల చిన్నారిని జ్యోతి(22) అనే మహిళ కిడ్నాప్ యత్నానికి ప్రయత్నించింది. చిన్నారి టాయిలెట్‌కు వెళ్లిన సమయంలో చాక్లెట్లు ఆశ చూపి తీసుకెళ్లబోయింది. బురఖా ధరించి ఉండటంతో అనుమానం వచ్చిన స్థానికులు ఆరాతీయడంతో కిడ్నాప్ వ్యవహారం బయటపడింది. అనంతరం ఆమెకు స్థానికులు దేహశుద్ధి చేశారు. మహిళ హ్యాండ్ బాగ్‌లో ఓ కత్తి, రెండు బ్లేడ్లు, 7 సిమ్‌లు కార్డులు ఉండటం చూసి టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి ఆమెను స్టేషన్ కు తరలించారు.