మగ్గిపోయిన రూ.50 లక్షల విలువైన చింతపండు
కడప(వైఎస్ఆర్ జిల్లా): గోడౌన్లలో 50 లక్షల రూపాయల విలువైన చింతపండు మగ్గిపోవడంపై ఏపి పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అధికారులపై మండిపడ్డారు. పౌరసరఫరాల అధికారులతో మంత్ఉరి ఈరోజు ఇక్కడ సమీక్ష నిర్విహించారు. రాయలసీమ నుంచి కర్ణాటకకు అక్రమంగా బియ్యం రవాణా అవుతున్నాయని, వాటిని నివారించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆమె అన్నారు.
మండలానికో కిరోసిన్ బంక్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు మంత్రి తెలిపారు. వైఎస్ఆర్ సిపికి చెందిన డీలర్లను కక్ష సాధింపుతో తొలగిస్తున్నారని, పార్టీలకు అతీతంగా వ్యవహరించాలని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి కోరారు. వృద్ధ్యాప్య పెన్షన్లలో కొత్త విధానం ఇబ్బందికరంగా మారిందని మేయర్ సురేష్ బాబు చెప్పారు. సోమశిల బ్యాక్‌వాటర్ పనులను కొనసాగించాలని కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా కోరారు.
ఈ సమీక్షా సమావేశానికి విప్ మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.