ఆరుగురు కన్ఫర్డ్ ఐఏఎస్‌లకు చుక్కెదురు
నియామకం చెల్లదు.. క్యాట్ సంచలన తీర్పు
సాక్షి, హైదరాబాద్: పదోన్నతుల(కన్ఫర్డ్) ద్వారా ఐఏఎస్‌లుగా నియమితులైన ఆరుగురు అధికారులకు కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్(క్యాట్)లో చుక్కెదురైంది. కన్ఫర్డ్ ఐఏఎస్‌లుగా నియమితులైన ఎన్.సత్యనారాయణ, సి.శ్రీధర్, ఎ.మహ్మద్ ఇంతియాజ్, ఎం.ప్రశాంతి, పి.కోటేశ్వరరావు, అరవింద్సింగ్ల నియామకం చెల్లదని క్యాట్ స్పష్టం చేసింది. అంతేగాక 2013 సంవత్సరానికి పదోన్నతులద్వారా ఆరు ఐఏఎస్ పదవుల భర్తీకి 30 మందితో రూపొందించిన జాబితాను రద్దు చేసింది. తాజాగా జాబితాను రూపొందించి రెం డు నెలల్లో ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
బి.వి.రావు, రంజనా చౌదరిలతో కూడిన క్యాట్ ధర్మాసనం బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. వార్షిక నివేది కలు అందలేదన్న కారణంతో అన్ని అర్హతలున్న తమ పేర్లను కన్ఫర్డ్ ఐఏఎస్ పదవులకోసం పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ ఐ.శ్రీనగేష్, మరో 23 మంది క్యాట్‌లో పిటిషన్లు వేశారు. వీటిపై సుదీర్ఘ విచారణ జరిపిన క్యాట్ బుధవారం తీర్పునిచ్చింది. ఏసీఆర్ అందలేద న్న కారణంతో 22 శాఖలకు చెందినవారి పేర్లను కన్ఫర్డ్ ఐఏఎస్‌ల జాబితాలో చేర్చకపోవడాన్ని కోర్టు తప్పుపట్టింది. జాబితాతోపాటు ఆరుగురు కన్ఫర్డ్ ఐఏఎస్‌ల నియామకం చెల్లదని పేర్కొం ది. అంతేగాక ప్రభుత్వానికి జరిమానా విధిం చింది. ఒక్కో పిటిషనర్‌కు ఖర్చుల కింద రూ.25 వేలు చొప్పున చెల్లించాలని ఆదేశించింది.