ఒక్క ఛాన్స్... వెరీ రేర్ ఛాన్స్!
మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ బచ్చన్‌కి అరుదైన అవకాశం లభించింది. ఇప్పటి వరకూ ఎన్నో ఫిల్మ్ ఫెస్టివల్ వేదికల్లో రెడ్ కార్పెట్‌పై హొయలొలికించిన ఈ బ్యూటీకి తాజాగా ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్’(ఐ.ఎఫ్.ఎఫ్.ఎమ్) వేడుకల్లో సందడి చేసే అవకాశం వచ్చింది. ప్రతి ఏడాది ఆస్ట్రేలియాలో అట్టహాసంగా జరిగే ఈ వేడుకలు ఈ ఏడాది ఆగస్టులో జరగనున్నాయి.
ఫ్రాన్స్‌లో జరిగే ‘కాన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ వంటి ప్రతిష్టాత్మకమైన ఈవెంట్స్‌లో పాల్గొన్న ఐశ్వర్యకు ఐ.ఎఫ్.ఎఫ్.ఎమ్‌లో పాల్గొనడం అరుదైన అవకాశమేంటి? అనే డౌట్ వస్తోందా? అక్కడే విశేషం ఉంది. ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్’ వేడుకల్లో భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ఐశ్వర్య ఎగురవేయనున్నారు. మెల్బోర్న్లో ఇండియా జాతీయ జెండా ఎగురవేసే తొలి భారతీయ మహిళ ఐశ్వర్యారాయ్ కావడం విశేషం. ఇప్పటి వరకూ ఏ నటికీ రాని అవకాశం ఐష్‌కి రావడం అరుదైనదే కదా!