ఓటుకు రాష్ట్రపతి దూరం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ఓటు హక్కును వినియోగించుకోకూడదని నిర్ణరుుంచుకున్నారు. ప్రస్తుత ఎన్నికల పోరాటంలో తటస్థతను వ్యక్తం చేసే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు ప్రణబ్ అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. అలా చేస్తే ఆ విధంగా ఓటు వేసిన మొదటి ప్రథమ పౌరుడిగా ఆయన రికార్డులకెక్కేవారు. కానీ చివరకు ఓటు వేయకూడదనే ప్రణ బ్ నిర్ణరుుంచుకున్నారు.
తద్వారా తన పూర్వీకులు అనుసరించిన సంప్రదాయూ న్ని ఆయన కొనసాగించనున్నారు.ఈ మేరకు రాష్ట్రపతి మీడియూ కార్యదర్శి వేణు రాజమణి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఎన్నికలు జరగనున్న దక్షిణ కోల్కతా స్థానంలోని 160 రస్బెహారీలో ప్రణబ్ ఓటరుగా ఉన్నారు.