Rasya
-
సాక్షి కార్టూన్ 30-10-2021
-
పుతిన్‌ను కలిసిన డాక్టర్‌కు పాజిటివ్
మాస్కో: గతవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిసిన ఒక డాక్టర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మాస్కోలోని ప్రత్యేక కరోనా ఆసుపత్రి చీఫ్‌గా పనిచేస్తున్న డెనిస్ ప్రాట్సెంకొ గత మంగళవారం పుతిన్ కొమునార్క ఆసుపత్రిని సందర్శించిన సమయంలో పుతిన్‌తో పాటు ఉన్నారు. ఆ డాక్టర్‌కు కరోనా సోకినట్లుగా తాజాగా నిర్ధారణ అయింది. అయితే, హాస్పిటల్‌కు వెళ్లిన సమయంలో పుతిన్ హజ్మత్ సూట్‌ను ధరించి ఉన్నారు. పుతిన్‌కు ఆరోగ్య పరీక్షలు జరిగాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రష్యా ప్రకటించింది. (విదేశాల్లోనూ టీకాను పరీక్షిస్తాం: చైనా ) చదవండి: పేషెంట్ జీరో ఎవరు? -
వీసా లేకుండా రష్యా వెళ్లొచ్చు..
మాస్కో: రష్యా వెళ్లే భారతీయులకు ఇకపై వీసా అవసరం ఉండదు. ఈ అవకాశాన్ని రష్యా 18 దేశాలకు కల్పించింది. ఇందులో ఇండియా కూడా ఒకటి. ఈ విషయాన్ని ఆదేశ ప్రధానమంత్రి మెద్వెదేవ్ స్వయంగా ప్రకటించారు. ఇండియాతోపాటు యూఏఈ, అల్జీరియా, బహ్రెయిన్, బ్రూనే, కువాయిట్, ఇరాన్, ఖతార్, చైనా, ఉత్తరకొరియా, మొరాకో, మెక్సికో, ఒమన్, సౌదీ అరేబియా, సింగపూర్, ట్యునీసియా, టర్కీ, జపాన్ దేశాల నుంచి రష్యా తూర్పును ఉన్న నగరాలు, పట్టణాలకు వెళ్లే పర్యాటకులు, వ్యాపారవేత్తలకు ఈ వెసులుబాటు వర్తించనుంది. తూర్పు రష్యాలో పెట్టుబడులను ఆకర్షించటంతోపాటు పర్యాటక రంగ ఆదాయం పెంచుకునే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ నిర్ణయంపై సానుకూలంగా స్పందించే దేశాలతో వీసా-ఫ్రీ ఒప్పందాలు కుదుర్చుకుంటామని చెప్పారు. ఈ మేరకు ఆయా దేశాల నుంచి వచ్చేవారికి సంబంధించిన పూర్తి వివరాలతో ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇంతేకాకుండా, ఈ ప్రాంతంలోనే ఉన్న వ్లాడివోస్టోక్ నౌకాశ్రయంలో ఎటువంటి వీసా అవసరం లేకుండా పర్యటించేందుకు మార్చి నుంచి వీలు కల్పించినట్లు వివరించారు. -
రష్యా సాయంతో ఐదోతరం యుద్ధ విమానాలు
రక్షణ శాఖ సలహాదారు సారస్వత్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: రష్యా సహకారంతో ఐదోతరం యుద్ధ విమానాల తయారీకి డీఆర్డీవో రూపకల్పన చేస్తున్నట్టు భారత రక్షణ మంత్రిత్వ శాఖ సలహాదారు డాక్టర్ వీకే సారస్వత్ తెలిపారు. భవిష్యత్తులో మానవ రహిత, సౌరశక్తితో నడిచే విమానాలు రానున్నాయని, రష్యా సహకారంతో వీటి రూపకల్పనకు ప్రణాళికలు రచిస్తున్నామని పేర్కొన్నారు. స్థానిక గీతం వర్సిటీ, హైదరాబాద్ ఏరోనాటిక్ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ‘మోడ్రన్ ఏయిర్క్రాఫ్ట్ సిస్టమ్’పై రెండు రోజులు నిర్వహించనున్న జాతీయ సదస్సును సారస్వత్ సోమవారం ప్రారంభించారు. వర్సిటీ డెరైక్టర్ డాక్టర్ సంజయ్, ఏరోనాటికల్ హెచ్ఆర్డీ డాక్టర్ స్వామినాయుడు, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా కార్యదర్శి విజయ్‌కుమార్, గీతం రెసిడెంట్ డెరైక్టర్ వర్మ ఇందులో పాల్గొన్నారు.