Rattan Lal Kataria: బీజేపీ ఎంపీ రతన్‌లాల్ కన్నుమూత
చండీగఢ్: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ రతన్‌లాల్ కటారియా(72) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో (న్యుమోనియా) బాధపడుతున్న రతన్‌లాల్.. చండీగఢ్‌లోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ప్రస్తుతం ఆయన హర్యానాలోని అంబాలా నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2019 నుంచి 2021 వరకు రతన్‌లాల్ కేంద్రమంత్రిగా పనిచేశారు. కేంద్ర జల్‌శక్తి, సామాజిక న్యాయం, సాధికారిత శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
కటారియా మృతిపట్ల హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్, స్పీకర్ జియాన్ చంద్ గుప్తా సంతాపం తెలిపారు. గురువారం సాయంత్రం అధికార లాంఛనాలతో రతన్‌లాల్ కటారియా అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో, అంబాలా లోక్‌సభ స్థానం నుంచి ప్రస్తుత హర్యానా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కుమారి సెల్జాపై 57 శాతం ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అంతకు ముందు 1999, 2014లో అంబాలా నుంచే ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో కుమారి సెల్జా చేతిలో ఓటమిని చవిచూశారు.
చదవండి: హైదరాబాద్‌కు వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ.. 1200 మందికి ఉపాధి