raw materilas price increases
-
ఇళ్లు కట్టుకునేవారికి షాక్ ! వాటి ధరల్లో పెరుగుదల
సాక్షి, హైదరాబాద్: సిమెంట్, స్టీల్, రంగులు వంటి నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిన నేపథ్యంలో వచ్చే నెల నుంచి గృహాల ధరలు పెరుగుతాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (క్రెడాయ్) అంచనా వేసింది. అపార్ట్మెంట్లు, విల్లాలు, వ్యక్తిగత గృహాల రేట్లు 10–15 శాతం మేర వృద్ధి చెందుతాయని పేర్కొంది. కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్ల పాటు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న నిర్మాణ రంగాన్ని.. తాజాగా నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదల మరింత దెబ్బతీస్తోందని అభిప్రాయపడింది. నిర్మాణ వ్యయం పెరగడంతో ఆ మేరకు వచ్చే లాభం తగ్గిపోయిందని, దీంతో ఇళ్ల రేట్లను పెంచడం మినహా డెవలపర్లకు మరో మార్గం లేదని స్పష్టం చేసింది. కాపర్, పీవీసీ, రంగులు, అల్యూమినియం ధరలు రికార్డ్ స్థాయిలో పెరిగాయి. -
క్రిమిసంహారకాల రేట్ల పెంపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ముడిసరుకుల ధరల పెరుగుదల, రూపాయి మారకం హెచ్చుతగ్గుల నేపథ్యంలో క్రిమిసంహారకాల రేట్లను 10-15 శాతం మేర పెంచుతున్నట్లు ఇన్సెక్టిసైడ్స్ ఇండియా ఎండీ రాజేష్ అగర్వాల్ తెలిపారు. విడతల వారీగా ఈ రెండు నెలల్లో (డిసెంబర్, జనవరి) 30 ఉత్పత్తుల ధరలు పెంచుతున్నట్లు చెప్పారు. రాబోయే కొన్నాళ్లలో ముడిసరుకుల రేట్లు మరో 5-10% పెరగొచ్చని మంగళవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అగర్వాల్ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రాష్ట్ర మార్కెట్ నుంచి ఆదాయం సుమారు 50 శాతం పెరిగి రూ. 150 కోట్లకు చేరగలదని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇది సుమారు రూ. 100 కోట్లు. ఇక గతేడాది మొత్తం టర్నోవరు రూ. 650 కోట్లు కాగా ఈసారి రూ. 900 కోట్లు అంచనా వేస్తున్నట్లు అగర్వాల్ పేర్కొన్నారు. మరోవైపు, గడచిన నాలుగేళ్లుగా ఉత్పత్తి సామ ర్థ్యం పెంపుపై సుమారు రూ. 200 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు ఆయన చెప్పారు. తాజాగా రాజస్థాన్‌లో నిర్మిస్తున్న ఆరో ప్లాంటు జనవరికల్లా అందుబాటులోకి రాగలదన్నారు. ఇక దేశీయ పరిజ్ఞానంతో క్రిమిసంహారకాల తయారీపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని అగర్వాల్ చెప్పారు. ఇందులో భాగంగా జపాన్‌కి చెందిన ఒత్సుక అగ్రిటెక్నో సంస్థతో కలిసి పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రాథమికంగా దీనిపై రూ. 50 కోట్లు, తదుపరి నాలుగేళ్లలో మరో రూ. 50 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు అగర్వాల్ వివరించారు. అటు, కంపెనీ రాబడులు మరింత పెరిగిన పక్షంలో వచ్చే రెండేళ్ల వ్యవధిలో కొంత వాటాల విక్రయం ద్వారా విస్తరణకు కావాల్సిన నిధులను సమకూర్చుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు.