‘రాయల’ పై రగడ
‘మా తెలంగాణ మాకివ్వాలంటే.. మధ్యల గీ రాయల తెలంగాణ లొల్లి ఏంది...’ అంటూ బుధవారం జిల్లా భగ్గుమంది. రాయల తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం నివే దిక రూపొందిస్తున్నట్లు వార్తలు రావడంతో జిల్లా వ్యాప్తంగా తెలంగాణవాదులు ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. రాయల తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని తేల్చిచెప్పారు.
రాయల తెలంగాణను వ్యతిరేకిస్తూ జిల్లావ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు పార్టీ కార్యకర్తలు, టీఆర్ఎస్వీ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వీరితో పాటు బీజేపీ, సీపీఐ, టీఎస్‌జేఏసీ, ఏబీవీపీ, పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు నిర్వహించారు. పలు చోట్ల కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు.
జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు సయ్యద్ ఇబ్రహీం నేతృత్వంలోబైక్ ర్యాలీ నిర్వహించారు. టీఆర్ఎస్వీ, తెలంగాణ విద్యార్థి జేఏసీ సంయుక్తంగా భారీ ర్యాలీ చేపట్టారు. తెలంగాణ ఆటో యూనియన్ ఆధ్వర్యం లో ర్యాలీ నిర్వహించారు. గురువారం జరగనున్న బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
వనపర్తిలో జేఏసీ, టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, టీవీవీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ ను దహనం చేశారు. టీఆర్ఎస్ విద్యార్థి వి భాగం ఆధ్వర్యంలో రాజీవ్‌చౌక్‌లో మానవహా రం నిర్వహించి, అక్కడి నుంచి ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి ధర్నా చేపట్టారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. పెబ్బేరు, గో పాల్‌పేట మండలాల్లోనూ నిరసన ర్యాలీలు చేపట్టారు.
నాగర్‌కర్నూల్, తాడూరు, బిజినపల్లి, తి మ్మాజీపేట, తెలకపల్లి మండలాల్లో రాయల తె లంగాణకు వ్యతిరేకంగా టీఆర్ఎస్, టీఆర్ఎ స్వీ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. నాగర్‌కర్నూల్‌లో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. పాలెంలో ఏబీ వీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. అచ్చంపేట, బల్మూరు, ఉప్పునుంతల, అమ్రాబాద్ మండలాల్లో ర్యాలీలు నిర్వహించారు.
జడ్చర్లలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో అంబేద్క ర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించి, జీఓఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ జా గృతి ఆధ్వర్యంలో కళాశాలలు బహిష్కరించి, నే తాజీ చౌరస్తాలో కొద్దిసేపు రాస్తారోకో చేసి, అం బేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి, మానవహా రం నిర్వహించారు. షాద్‌నగర్, కొందుర్గు, కొ త్తూరు మండలాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు.
దేవరకద్రలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి అలవెంకటేశ్వరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గోపన్‌పల్లిలో కేంద్ర దిష్టిబొమ్మను దహనం చేశారు. కొత్తకోటలో టీఆర్ఎస్వీ, ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకో చేయగా, అడ్డాకులలో జాతీయ రహదారిపై విద్యార్థులు మానవహారం నిర్వహించారు.
మక్తల్ నియోజకర్గంలోని పలుచోట్ల నిరసన ర్యాలీలు చేపట్టారు. మాగనూరు మండలం గుడెబళ్లూరులో అంతర్ర్రాష్ట రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఆత్మకూరులో ఏబీవీపీ ఆధ్వర్యంలో తరగతులు బహిష్కరించారు. కోస్గిలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జీఓఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. నారాయణ పేటలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
గద్వాలలో ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించగా, ఏబీవీపీ ఆధ్వర్యంలో మానవహారం చేపట్టారు. మల్దకల్లో టీఆర్ఎస్, ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జీఓఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. అలంపూర్, మానవపాడు, శాంతినగర్ మండలాల్లో నిరసన ర్యాలీలు చేపట్టారు.
కల్వకుర్తిలో జేఏసీ, టీఆర్ఎస్, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పాలమూరు చౌరస్తాలో మానవహారం, రాస్తారోకో నిర్వహించారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రధాని మన్మోహన్సింగ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తలకొండపల్లి, మాడ్గుల, వెల్దండ, ఆమనగల్లులో నిరసన ర్యాలీ చేసి, రాస్తారోకో నిర్వహించారు.
కొల్లాపూర్‌లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టగా, ఏబీవీపీ ఆధ్వర్యంలో జీఓఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. పెంట్లవెల్లి, పాన్‌గల్, వీపనగండ్లలో నిరసన ర్యాలీలు చేశారు.
నేడు బంద్
జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: రాయల తెలంగాణకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు పిలుపు మేరకు గురువారం జిల్లాలో బంద్ నిర్వహిస్తున్నట్లు టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు సయ్యద్ఇబ్రహీం, జిల్లా కోకన్వీనర్ బెక్కం జనార్దన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్య, వ్యాపార సంస్థలతోపాటు అన్ని వర్గాల ప్రజలు బంద్‌కు సహకరించాలని కోరారు.
బంద్‌కు జేఏసీ మద్దతు..
రాయల తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న టీఆర్ఎస్ బంద్‌కు జేఏసీ మద్దతు ఇస్తుందని జిల్లా చైర్మన్ రాజేందర్‌రెడ్డి, సమన్వయకర్త చంద్రనాయక్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ, ప్రభుత్వ, ైప్రైవేట్ ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపి, బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు.