బ్యాంకులో దోపిడీకి యత్నం
కర్నూలు: కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం పెద్దకడబూరులోని రాయలసీమ గ్రామీణ బ్యాంకులో దొంగలు దోపిడీకి విఫలయత్నం చేశారు. సోమవారం అర్ధరాత్రి బ్యాంకు కిటికీలు తొలగించి లోపలికి ప్రవేశించారు. లోపల ఉన్న బీరువా తెరిచే ప్రయత్నం చేశారు. అయితే బీరువా తెరుకుకోకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.మంగళవారం ఉదయం బ్యాంకు అధికారులు వచ్చి చూసేసరికి కిటీకీలు తొలగించి ఉంది. అయితే డబ్బు చోరీ కాకపోవడంతో బ్యాంకు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం గురించి బ్యాంకు అధికారులు పోలీసులకు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.