అన్నీ ఇచ్చి.. ఆదరణ కరువై...
కుమారుడు పట్టించుకోవడం లేదని ఆర్డీఓ కోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు
పాల్వంచ రూరల్: నవమాసాలు మోసి.. అష్టకష్టాలు పడి కనిపెంచిన కొడుకు... మలిదశలో ఆదుకోవాల్సిందిపోయి వేధిస్తున్నాడని, తమకు న్యాయం చేయాలంటూ ఓ వృద్ధ తల్లిదండ్రులు ఆర్డీఓ కోర్టును ఆశ్రయించారు. పాల్వంచలోని ఆర్డీఓ కోర్టుకు ఆ వృద్ధ దంపతులు మంగâýæవారం హాజరయ్యారు. ములకలపల్లి మండలం చాపరాలపల్లి గ్రామానికి చెందిన నున్నా సూరయ్య (85), నున్నా రమణమ్మ (80) దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. సూరయ్యకు 12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కొంత భూమిని కూతుâýæ్లకు ఇవ్వగా, మిగిలిన కొంత కుమారుడు నున్నా నర్సింహారావుకు ఇచ్చారు. కొంతకాలం తన దగ్గర ఉంచుకుని, ఇటీవల తల్లిదండ్రులను కుమారుడు పట్టించుకోకుండా వదిలేశారు. దీంతో తల్లిదండ్రులు అదే గ్రామంలో ఉన్న కూతుళ్ల వద్ద ఆశ్రయం పొందుతున్నారు. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ చేయడంతో తానే సంరక్షిస్తానని అంగీకరించిన కుమారుడు తిరిగి పట్టించుకోవడం లేదు. దీంతో వృద్ధ దంపతులు ఎ¯ŒSజీఓ మహిళా సాధికారత సంస్థ ఉమె¯ŒS ఎంపవర్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు మందపల్లి ఉమను ఆశ్రయించారు. కుమారుడు నర్సింహారావు తీరుపై మూడు వారాల క్రితం పాల్వంచ ఆర్డీఓ కోర్టును ఆశ్రయించి న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు మంగâýæవారం ఆర్డీఓ కోర్టు ఎదుట తల్లిదండ్రులు, కుమారుడు హాజరయ్యారు. ఆర్డీఓ విచారణ నిర్వహిన్నారు.