మహిళను గొడ్డలితో నరికి చంపిన యువకుడు
గుంటూరు : గుంటూరు జిల్లా రెంటచింతలలో దారుణం జరిగింది. స్థల వివాదం కాస్తా ఓ మహిళ ప్రాణాలు తీసింది. స్థానికంగా నివాసం ఉంటున్న ఇరు కుటుంబాల మధ్య స్థల వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఓ యువకుడు.... మహిళను గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటన కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.