బర్డ్‌ఫ్లూపై అధికారుల స్పందన బాగుంది
కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి రాణా
హైదరాబాద్: బర్డ్‌ఫ్లూపై అధికారుల స్పందన బావుందని, వైరస్ వ్యాపించకుండా తక్కువ సమయంలో కోళ్లను సంహరించిన ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ సభ్యులు అభినందనీయులని కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి రజ్వీర్సింగ్రాణా అన్నారు. శనివారం హయత్‌నగర్ మండలంలోని తొర్రూరులో బర్డ్‌ఫ్లూ వెలుగుచూసిన ఫౌల్ట్రీ ఫారాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫౌల్ట్రీ ఫారాల్లో శాంపిల్స్ 15 రోజులకు ఒకసారి పరిశీలిస్తామని 90 రోజులు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఆ తర్వాత ఫ్లూ కనిపించకుంటే వైరస్ లేని జోన్‌గా ప్రకటిస్తామన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డెరైక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్జేడీ వరప్రసాద్‌రెడ్డి, నోడల్ అధికారి దుర్గయ్య పాల్గొన్నారు. కాగా కేంద్ర వైద్య బృందం శనివారం గాంధీ ఆస్పత్రిని సందర్శించింది. రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ రామనాథం నేతృత్వం లో ఢిల్లీ రాంమనోహర్ లోహియా ఆస్పత్రి ప్రతినిధి పవన్‌కుమార్, గాంధీ ఇన్చార్జి సూపరింటెండెంట్ మసూద్, నోడల్ అధికారి నర్సిం హులతో సమావేశమై ఆస్పత్రిలో సదుపాయాలపై ఆరా తీశారు.