బ్యాండ్ బజాయించండి!
మేడ్ ఇన్ హోమ్
చేతికి వాచీ పెట్టుకోవడం ఓల్డ్ ఫ్యాషన్. చక్కని బ్యాండ్ పెట్టుకోవడం నేటి ఫ్యాషన్. మోడ్రన్ డ్రెస్ వేసుకున్నప్పుడే కాదు... ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా చేతికి ఓ సింపుల్ బ్యాండ్ తగిలిస్తే లుక్కే మారిపోతుంది. రిచ్‌నెస్ పెరుగుతుంది. అలా అని కొనక్కర్లేదు. రంగురంగుల పూసలు, ఎలాస్టిక్, మెటల్ లింక్స్ ఉంటే మనమే తయారు చేసుకోవచ్చు. మొదట మీ చేతి చుట్టుకొలతను బట్టి ఎలాస్టిక్ తీసుకోవాలి. దానికి ఓ చివర చెయిన్‌కి వేసే మెటల్ లింక్‌ని అటాచ్ చేయండి (గమ్‌తో అతికించడం, ముడి వేయడం కంటే సూదీ దారంతో కుట్టేస్తే ఊడకుండా ఉంటాయి). తర్వాత పూసల్ని ఓ వరుసలో ఎలాస్టిక్కు ఎక్కించండి. ఆపైన ఎలాస్టిక్ రెండో చివరను కూడా లింక్‌కు కలిపి కుట్టేయండి. ఎలాస్టిక్ బదులు తీగ, వూల్ లాంటివి కూడా వాడొచ్చు కానీ ఎలాస్టిక్ అయితే చేతి సైజును బట్టి చక్కగా అమరుతుంది. కాబట్టి అదే బెస్ట్. పూసల రంగులు మీ ఇష్టం!
షాంపూ అయిపోయాక షాంపూ డబ్బాతో ఏం పని? డస్ట్‌బిన్‌లో పారేయడమే. లేదు లేదు. ఏ వస్తువు విషయంలోనూ అలా అను కోడానికి వీల్లేదు. డస్ట్‌బిన్‌లో పారేసే ముందు ఒక్క క్షణం ఆలోచిస్తే కొత్త అయిడియా ఏదైనా మైండ్‌లో తళుక్కుమంటుందేమో! మనలో ఉన్న క్రియేటివిటీకి కాస్త పదును పెడితే పాత వస్తువు నుంచి కొత్త వస్తువేదైనా పుడుతుందేమో! కొందరు అలా చేయ బట్టే ఇవి పుట్టుకొచ్చాయి. ఇవన్నీ ఖాళీ అయిపోయిన షాంపూ డబ్బాలు. వాటిని రకరకాలుగా కట్ చేసి రకరకాల ఆకారాల్లోకి తీసుకు రావడం జరిగింది. అందమైన రంగులు వేసి... పెన్ స్టాండులుగా, సెల్‌ఫోన్ పౌచ్లాగా, పిల్లలు ఆడుకునే బొమ్మ ల్లాగా మార్చేశారు. మీరూ ఇలా చేయవచ్చు. ముందుగా డబ్బాని నచ్చిన ఆకారంలో కత్తిరించండి. తర్వాత ఓ క్యాండిల్ వెలిగించి, డబ్బాకు కాస్త వేడి తగిలేలా చేయండి (దీనివల్ల మెటీరియల్ గట్టిపడు తుంది. మరీ దగ్గరగా పెడితే కరిగిపోతుంది జాగ్రత్త). ఆపైన రంగులు, చక్కని డిజైన్లూ వేయండి. అప్పుడు ఇలా తయారవు తాయి. ఇలానే ఎందుకు? కాస్త జాగ్రత్తగా ఆలోచించి, కొత్తగా ఇంకేవైనా చేయడానికి ట్రై చేయండి. అప్పుడు ఖాళీ డబ్బాలు పారేయనక్కర్లేదు. మీరూ ఫ్రీటైమ్‌లో ఖాళీగా ఉండక్కర్లేదు.