14 ఏళ్ల అజ్ఞాత జీవితానికి తెర
సహచరితో కలిసి లొంగిపోరుున మావోయిస్టు దండకారణ్య డివిజనల్ కమిటీ సభ్యుడు బిక్షపతి జిల్లాలో ఆర్కే గన్‌మన్‌గా {పారంభమైన రహస్య జీవితం పలు కేసుల్లో నిందితుడు
వరంగల్‌క్రైం : ఆత్మకూరు మండలం మహ్మద్‌గౌస్‌పల్లికి చెందిన బైరబోరుున బిక్షపతి అలియూస్ కిరణ్ అలియూస్ రమేష్ పద్నాలుగేళ్ల అజ్ఞాత జీవితానికి స్వస్తి పలికి పోలీసులకు మంగళవారం లొంగిపోయూడు. ఆయనతోపాటు దళసభ్యురాలైన అతడి భార్య పడ రుక్ష్మిణి అలియాస్ సునీత లొంగిపోరుుంది. మావోరుుస్టు దంపతుల లొంగుబాటు వివరాలను ఎస్పీ అంబర్ కిషోర్ ఝా వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. మహమ్మద్ గౌస్పల్లికి చెందిన బైరబోయిన బిక్షపతి తొమ్మిదో తరగతి చదువుతూ 16 సంవత్సరాల వయస్సులోనే విప్లవ సాహిత్యానికి ఆకర్షితుడయ్యాడు. అప్పటి పీపుల్స్‌వార్ గ్రూప్ పాండవ దళకమాండర్ లతక్క, పార్టీ జిల్లా కార్యదర్శి పోలెం సుదర్శన్‌రెడ్డి అలియాస్ ఆర్కే భార్య భారతక్క ప్రోత్సాహంతో 2001లో పరకాల దళంలో చేరాడు. 2002లో బిక్షపతిని దళసభ్యుడిగా గుర్తించి జిల్లాలో సంచనాలకు మారుపేరుగా నిలిచిన అప్పటి పీపుల్స్‌వార్ జిల్లా కార్యదర్శి దివంగత పోలెం సుదర్శన్‌రెడ్డి అలియూస్ ఆర్కేకు బిక్షపతి గన్‌మన్‌గా నియమించారు. 2003లో ఆర్కే మరణించడంతో బిక్షపతి దండకారణ్యంలోని బస్తర్ జిల్లాలో 2005 వరకు పనిచేశాడు. 2005 నుంచి 2007 వరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అగ్రనాయకులకు కొరియర్‌గా పనిచేశాడు. అదే ఏడాది లొంగిపోయిన బిక్షపతి 2008లో పార్టీలోకి వెళ్లగా తిరిగి ద ండకారణ్యానికి చెందిన మావోయిస్టు 5వ కంపెనీ ఏరియా కమిటీ సభ్యుడిగా, 2009లో 5వ ప్లాటూన్‌కు కమాండర్‌గా నియమించారు. అదే సంవత్సరం దండకారణ్య దళ సభ్యురాలిగా పనిచేస్తున్న పడ రుక్ష్మిణి అలియాస్ సునీతను వివాహం చేసుకున్నాడు. 2010 నుంచి 1వ కంపెనీ కమాండర్‌గా పనిచేస్తున్నాడు.
బిక్షపతిపై నమోదైన కేసులు..
2007 డిసెంబర్ 5న చత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లాలోని విశ్రాంపూర్ పోలీస్ స్టేషన్‌పై దాడిచేసి అక్కడ విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసులను చంపి రెండు ఆయుధాలను అపహరించాడు.
2008లో కాంకేర్ జిల్లా చిన్పాల్ అటవీ ప్రాంతంలో అంబుష్ వేసి ఆ ప్రాంతంలో సంచరిస్తున్న ముగ్గురు పోలీసులను చంపి మూడు ఆయుధాలను ఎత్తుకెళ్లిన కేసులో నిందితుడు.
2009 మే 10న దాన్తరి జిల్లా మందగిరి పర్వత ప్రాంతంలో అంబుష్ వేసి 12 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందితోపాటు ఒక గ్రామస్తుడిని చంపి ఆయుధాలు అపహరించిన కేసులో నిందితుడు.
2010 జూన్ 30న నారాయణపూర్ జిల్లా కోంగెరా అటవీ ప్రాంతంలో ఒక సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్‌తో సహ 28 మంది సీఆర్పీఎఫ్ పోలీసులను చంపిన కేసులో బిక్షపతిది ముఖ్యపాత్ర.
2011లో జారా జిల్లాలో సీఐఎస్ఎఫ్ క్యాంప్‌పై దాడి చేసి ఐదుగురు జవాన్లను చంపి ఆయుధాలను ఎత్తుకెళ్లిన కేసులో నిందితుడు.
2013 ఏప్రిల్ 27న తాడోకి పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసి ముగ్గురు పోలీసులను చంపి ఏకే 47 ఆయుధం ఎత్తుకెళ్లిన ఘటనలో ప్రమేయం.
బిక్షపతి పార్టీలో చురుకైన పాత్ర పోషించడంతో అతడిపై ప్రభుత్వం రూ.5 లక్షల రివార్డు ప్రకటించింది.
చిన్నతనంలోనే పెళ్లి ఇష్టం లేక పార్టీలోకి..
పడ రుక్ష్మిణి అలియాస్ సునీత చత్తీస్ఘడ్ రాష్ట్రం కాంకేర్జిల్లా ఈదుర్ గ్రామస్తురాలు. ఆమెకు ముగ్గురు అక్కాచెల్లెలు, నలుగురు అన్నదమ్ములు ఉండడంతో సునీతకు చిన్నతనంలోనే వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. దీనిని వ్యతిరేకించిన సునీత అదే సమయం లో మంకిడి లోకల్ గెరిల్లా స్క్వాడ్‌తో పరిచయం పెంచుకుని స్వ్కాడ్ ఏరియా కమిటీ కార్యదర్శి కాములు ప్రో త్సాహంతో 2006లో మావోయిస్టు పార్టీలో దళసభ్యురాలిగా చేరింది. 2009లో బైరబోయిన బిక్షపతిని వివాహం చేసుకుని అప్పటి నుంచి భర్తతో కలిసి పార్టీలో పనిచేస్తోంది. కాగా చత్తీస్‌గఢ్ ప్రభుత్వం సునీతపై రూ.లక్ష రివార్డు ప్రకటించింది. పార్టీ అధినాయకత్వ సిద్ధాంతా లు నచ్చకపోవడంతోపాటు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై జనజీవన స్రవంతిలో కలువాలని నిర్ణయించుకుని స్వచ్ఛందంగా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. వారికి తక్షణ సాయంగా ఇద్దరికి రూ.5 వేలు ఎస్పీ అందజేశారు. వారిపై ప్రకటించిన రివార్డును త్వరలో అందజేయనున్నారు.