స్కూల్లో షాకింగ్ సంఘటన
రోల్స్విల్లె: అమెరికాలో నార్త్ కరోలినాలోని రోల్స్విల్లె హైస్కూల్లో ఇద్దరు బాలికల మధ్య ఏర్పడ్డ చిన్న వివాదం పెద్ద దుమారం రేపింది. ఇద్దరు విద్యార్థుల మధ్య మాటామాట పెరిగి గొడవ పెద్దదయ్యింది. ఇద్దరూ కలియబడి కొట్టుకుని కిందపడ్డారు. ఈ తతంగాన్ని మరో అమ్మాయి తన సెల్‌ఫోన్‌తో వీడియా తీసింది. ఇంతలో ఓ పోలీస్ అధికారి వచ్చి ఓ అమ్మాయిని పైకెత్తి నేలపైన బంతిలా విసిరికొట్టాడు. దీంతో ఆ అమ్మాయి అక్కడే పడిపోయింది. బాధతో ఏడుస్తూ విలవిలలాడిపోయింది. పోలీస్ అధికారి ఆ అమ్మాయిని అక్కడి నుంచి లాక్కెళ్లిపోయాడు.
మొత్తం ఎపిసోడ్‌ను వీడియో తీసిన అమ్మాయి దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది వైరల్ కావడం, పోలీసు అధికారిపై తీవ్ర విమర్శలు రావడంతో ఆయనపై చర్యలు తీసుకున్నారు. సంబంధిత అధికారి రూబెన్ డి లాస్ శాంటోస్‌ను లీవ్‌పై పంపారు. కాగా అమ్మాయిల మధ్య వివాదం ఏర్పడటానికి కారణం ఏంటి, వారి వివరాలు తెలియరాలేదు.