బైక్ డిక్కీలో ఉంచిన రూ.3 లక్షలు మాయం
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో పట్టపగలే ఓ మోటారుసైకిలు డిక్కీలో ఉంచిన రూ.3 లక్షలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకుపోయారు. వివరాలివీ...పొందూరుకు చెందిన పశువుల వ్యాపారి వి.వెంకట్రావు శ్రీకాకుళంలోని ఎస్బీఐ నుంచి రూ.3 లక్షలు డ్రా చేసుకుని, తన బైక్ డిక్కీలో పెట్టారు. అనంతరం ఆయన రామలక్ష్మణ్ జంక్షన్లో బైక్ను ఉంచి పక్కనే ఉన్న మరో బ్యాంకులోకి వెళ్లి వచ్చి చూసేసరికి డిక్కీ తెరిచి ఉంది. డబ్బు మాయమైన విషయం గుర్తించిన ఆయన వెంటనే పోలీసులను ఆశ్ర యించారు.