రూ. 5 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం
చిత్తూరు జిల్లా నగరి మండలం ఓజీ కుప్పం వద్ద అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని భారీ ఎత్తున అటవీ శాఖ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పోలీసులుకు అప్పగించారు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
స్వాధీనం చేసుకున్నఎర్రచందనం విలువు రూ. 5 కోట్లు వరకు ఉంటుందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఎర్ర చందనం తరలిస్తున్న లారీని పోలీసులు సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.