గెలాక్సీకి పోటీగా ఎల్జీ ‘జీ 6’ లాంచ్..ధర ఎంత?
న్యూఢిల్లీ: సౌత్ కొరియా మొబైల్ మేకర్ ఎల్జీ మార్కెట్లోకి తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేసింది. ఎల్జీ జీ 6 పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. గత ఫిబ్రవరిలో మొబైల్ వరల్ఢ్ కాంగ్రెస్ లో ప్రకటించిన ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ ధరను కంపెనీ రూ.51,990గా నిర్ణయించింది. రెండు వేరియంట్లలో వస్తున్న జీ 6 ఏప్రిల్ 25నుంచి అమెజాన్ ఎక్స్‌క్లూజివ్‌గా అందుబాటులో ఉండనుంది. డాల్బీ విజన్ ఫీచర్ తో వస్తున్న ప్రపంచంలో మొట్టమొదిటి ఫోన్‌గా భావిస్తున్నారు. ఇప్పటివరకు హై ఎండ్ టీవీలలో మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉండడం ఈ జీ6 ప్రత్యేకత.
ఎల్జీ జీ 6 ఫీచర్లు
5.7 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే
గొరిల్లా గ్లాస్3 ప్రొటెక్షన్, డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్
ఫింగర్ ప్రింట్ స్కానర్
2880 x1400 పిక్సెల్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టమ్
క్వాల్కామ్ ఎంఎస్ఎం 8996 స్నాప్ డ్రాగన్821 ప్రోసెసర్
4జీబీ ర్యామ్
32జీబీ, 64 ఇంటర్నల్ స్టోరేజ్, 2 టీబీ దాకా ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం
13 మెగాపిక్సెల్ రియర్ డబుల్ కెమెరా
5 మెగాపిక్సెల్ ముందు కెమెరా
3300 ఎంఏహెచ్ బ్యాటరీ
కాగా జీ 5కి కొనసాగింపుగా వస్తున్న జీ6లో అసాధారణంగా ఫుల్ విజన్ డిస్ప్లేను అందిస్తున్న ట్టు ప్రకటించింది. మిస్టిక్ వూట్, అస్ట్రో బ్లాక్, ఐస్ ప్లాటినం మూడు రంగుల్లో ఇది లభ్యం కానుంది. రూ.51,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు రేపటి నుంచి లభ్యం కానుంది. మరోవైపు రూ. 57,990 రేంజ్ లో ఇటీవల లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌కి గట్టిపోటీ ఇవ్వనుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.