ముక్కుపిండి మరీ వసూలు చేసింది!
మూడు పదుల వయసు దాటినా ఏమాత్రం తగ్గటం లేదు చెన్నై చిన్నది త్రిష. పారితోషికం విషయంలో ఈ అమ్మడు డిమాండ్ చేసిన మొత్తాన్ని ముక్కు పిండి మరీ వసూలు చేయటం విశేషం. హీరో బాలకృష్ణ తాజా చిత్రం 'గాడ్సే'లో త్రిష ఓ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. నూతన దర్శకుడు సత్య దేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటించేందుకు నిర్మాతలు త్రిషను సంప్రదించగా ఆ అమ్మడు రూ.1.25 కోట్లు పారితోషికం డిమాండ్ చేసింది. అంత మొత్తాన్ని ఇస్తేనే నటిస్తానని ఖరాకండిగా చెప్పింది. దాంతో అవాక్కయిన సదరు నిర్మాత ఇతర హీరోయిన్లను పరిశీలించే పనిలో పడ్డారు.
అయితే బాలయ్య రికమెండేషన్‌తో త్రిషకు అంత మొత్తంలో పారితోషికం చెల్లించేందుకు నిర్మాతలు ఎట్టకేలకు ఒప్పుకున్నారు. ఆ మేరకు ఆమెకు భారీ మొత్తాన్ని చెల్లించుకున్నారు. అంత బిజీ కాకపోయినా సినిమా తర్వాత సినిమా అంటూ గ్యాప్ లేకుండా త్రిష అవకాశాలు రాబట్టుకుంటోంది. ఇక లక్కీ అంటే ఈ బ్యూటీదేనని చెప్పక తప్పదు. యువతరం కథానాయికలు రాజ్యం ఏలుతున్నా .... ఈ అమ్మడు మాత్రం తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఈ ఘటనతో నిరూపించుకుందనే చెప్పుకోవాలి.
మరో హీరోయిన్గా రాధిక ఆప్టే నటించనున్నట్లు సమాచారం. 'లెజెండ్'లో బాలయ్య మరదలుగా రాధికా ఆప్టే నటించిన విషయం తెలిసిందే. ఇక గాడ్సేలో బాలకృష్ణ సీబీఐ అధికారి పాత్ర పోషిస్తున్నాడు. ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని ఈ చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని రుద్రపాటి రమణరావు నిర్మిస్తున్నాడు.