జియో కిక్: రిలయన్స్ హై జంప్
ముంబై: బిలియనీర్ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలియన్స్ జియో జోష్‌తో మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్ ) బుధవారం నాటి మార్కెట్లో దూసుకుపోతోంది. ముఖ్యంగా ప్రైమ్ కస్టమర్లకు జియో ప్రకటించిన తాజా ఆఫర్ రిలయన్స్ కౌంటర్‌కి కిక్ ఇచ్చింది. ఇన్వెస్టర్ల భారీ కొనుగోళ్లతో ట్రేడింగ్ ప్రారంభం నుంచి లాభాల్లో ట్రేడ్ అవుతోంది. ఆరంభంలోనే భారీ లాభాలతో 2 శాతం ఎగిసి 1524 వద్ద తొమ్మిదేళ్ల గరిష్టాన్ని నమోదు చేసింది. అనంతరం వెనక్కి తగ్గినా 1.86 శాతం లాభంతో మార్కెట్లను లీడ్ చేస్తోంది.
రూ. 399 ప్లాన్‌తో 3 నెలల పాటు డేటా పొందవచ్చంటూ జియో కొత్త ఆఫర్ ప్రకటించింది. ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్ వంటి కంపెనీలు అన్నీ 3 నెలల పథకాలను చవకధరలకే ప్రకటిస్తుండడంతో.. తన రూ. 309 ప్లాన్‌ను సవరించినట్టు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
కాగా పూర్తిగా ఉచిత వాయిస్ కాలింగ్, డేటాప్లాన్‌తో టెలికా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో తరువాతికాలంలో తన ప్లాన్లను సవరించుకుంటూ వచ్చింది. ముఖ్యంగా పూర్తి ఉచితం నుంచి తక్కువ టారిఫ్ ప్లాన్లను, ప్రైమ్ మెంబర్ షిప్‌ను ప్రకటించింది. అనంతరం ధనాధన్ ఆఫర్ ను లాంచ్ చేసింది. ఇలా ప్లాన్లను పెంచుకుంటూ వచ్చిన జియో తొలుత సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ రూ.300, ధనాధన్ ఆఫర్ రూ.309 నుంచి తాజాగా రూ.399కి (84జీబీ 4 జీ డేటా 84 రోజులు) పెంచడం గమనార్హం.