RSV
-
తెలంగాణపై ఆర్ఎస్వీ పంజా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శ్వాసకోశ వైరల్ ఇన్ఫెక్షన్కు సంబంధించిన రెస్పిరేటరీ సింకీషియల్ వైరస్ (ఆర్ఎస్వీ) కేసులు పెరుగుతున్నాయి. చిన్న పిల్లల ఆసుపత్రులు, ఇతర సాధారణ ఆసుపత్రుల్లోనూ ఇలాంటి కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం నమోదవుతున్న శ్వాసకోశ వ్యాధుల్లో ఆర్ఎస్వీ ఒక ప్రధాన కారణంగా ఉంటోంది. చిన్న పిల్లల్లో ఎక్కువగా ఈ కేసులు నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా రెండు వారా లుగా వైరల్ న్యుమోనియా కేసులు పెరుగుతున్నా యి. జలుబు కాస్తా న్యుమోనియాగా దారితీస్తుంది. దమ్ము కూడా వస్తుంది. 5 ఏళ్లలోపు... 60 ఏళ్లు పైబడిన లేదా దీర్ఘకాలిక జబ్బులున్న వారిపై దీని ప్రభావం ఎక్కువగా కనబడుతోంది. ఇతర వయసువారిపైనా ప్రతాపం చూపిస్తోంది. జ్వరం, జలుబు, కఫంతో కూడిన తీవ్రమైన దగ్గు, నిమ్ము, బలహీనత రెండు వారాల వరకు ఉంటుంది. చిన్న పిల్లల్లో ఐసీయూకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. దగ్గు వచ్చిన మొదట్లోనే అప్రమత్తం కావాలని, చిన్నపిల్లలు మూడు నాలుగు రోజుల తర్వాత అది నిమ్ము దశకు చేరుకుంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఆర్‌ఎస్‌వీలో ఏ, బీ అనే రెండు రకాలున్నాయి. ఇప్పటివరకు ఇండియా 587 ఏ రకం వైరస్, 344 బీ రకం వైరస్‌లను ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్లేషించింది. ఏడాదికి సగటున దేశంలో 3.31 కోట్ల చిన్నారులపై వైరస్ పంజా... ప్రతీ ఏడాది భారత్‌లో సగటున 3.31 కోట్ల మంది చిన్నారులు ఆర్ఎస్వీ బారిన పడుతున్నారు. వారిలో 10 శాతం మంది ఆసుపత్రుల పాలవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఏడాదికి ఈ వైరస్ వల్ల దేశంలో 59,600 మంది చనిపోతున్నారు. రెండేళ్లు నిండిన ప్రతి చిన్నారి ఒక్కసారైనా ఈ వైరస్ బారినపడతారు. ఈ సంవత్సరం దాని ప్రభావం మరింత పెరిగింది. ఐదు వారాల క్రితం వరకు ఈ వైరస్ పాజిటివిటీ రేటు 5 శాతంలోపుగా ఉంటే, ప్రస్తుతం 10 శాతంగా ఉందని కేంద్రం తెలిపింది. ఐసీఎంఆర్ డ్యాష్‌బోర్డ్ ప్రకారం వైరల్ కేసుల్లో 15 శాతం ఆర్ఎస్వీ కేసులే. -
ప్రేమ ఎంత కఠినం!
కనువిప్పు ఆ అమ్మాయితో మాట్లాడడానికి తప్ప చదువుకోవడానికి కాలేజికి వెళ్లేవాడిని కాదు. దాని ఫలితం పరీక్ష తప్పడం. ప్రేమ ఎంత కఠినం... అనే మాటను మామూలుగానైతే ప్రేమలో భంగపడిన సందర్భంలోనో, విరహవేదనలో ఉన్నప్పుడో వాడుతుంటారు. కానీ, నేను మాత్రం ఆ నేపథ్యం నుంచి ‘ప్రేమ ఎంత కఠినం’ అనే మాటను వాడడం లేదు. ఎందుకు వాడానో తెలుసుకోవాలంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్‌లోకి... నేను మొదటి నుంచి చదువులో ముందుండే వాడిని. ‘‘అరే...వాడిని చూసి నేర్చుకోండిరా...స్టూడెంట్ అంటే అలా ఉండాలి’’ అని చదువులో వెనకబడిన విద్యార్థులను ఉద్దేశించి టీచర్లు నా గురించి చెప్పేవారు. ఇంటర్మీడియెట్‌లో చేరిన తరువాత మాత్రం పరిస్థితి పూర్తిగా మారింది. నేను ఒక అమ్మాయి ప్రేమలో పడ్డాను. నిజానికి అది ప్రేమ కాదు ఆకర్షణ అంటే సరిపోతుందేమో. ఆ అమ్మాయిని మెప్పించడం, ఆమెతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉండడమే నా లోకం అయిపోయింది. చదువు కాస్తా వెనక్కి వెళ్లిపోయింది. ఆ అమ్మాయితో మాట్లాడడానికి తప్ప చదువుకోవడానికి కాలేజికి వెళ్లేవాడిని కాదు. దాని ఫలితం పరీక్ష తప్పడం. ఈ సమయంలోనే వాళ్ల నాన్నకు బదిలీ కావడంతో ఆ అమ్మాయి మహారాష్ట్రకు వెళ్లిపోయింది. ఒకవైపు పరీక్ష తప్పిన బాధ, మరోవైపు ఆ అమ్మాయి దూరమైన బాధ....నా మానసిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింది. బరువు చాలా తగ్గిపోయాను. ఎప్పుడూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండేవాడిని. ‘‘నీకు ఎంత డబ్బు అంటే అంత ఇస్తాను. నీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసుకో. సినిమాలకు వెళతావో, ఫ్రెండ్స్‌తో షికార్లకు వెళతావో నీ ఇష్టం. ఖాళీగా మాత్రం కూర్చోవద్దు. అనవసరంగా ఆలోచించవద్దు’’ అని చెప్పాడు నాన్న. బయటకు వెళ్లి సినిమాలైతే చూడలేదుగానీ, మా ఇంట్లో ఉన్న సిస్టమ్‌లో ఇరానీ సినిమాలు కొన్ని చూశాను. ప్రతి సినిమాలోనూ ఏదో ఒక సందేశం నా దరికి చేరేది. ‘‘నాకు కాళ్లు చేతులు మాత్రమే లేవు. ఆత్మవిశ్వాసం ఉంది’’ అని చెబుతుంది ఒక ఇరానీ సినిమాలో ఒక పాత్ర. ఇది నా మీద చాలా ప్రభావం చూపించింది. ‘‘నాకు కాళ్లూ చేతులు మాత్రం ఉన్నాయి. ఆత్మవిశ్వాసం లేదు’’ అనుకున్నాను. నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నాను. అటకెక్కిన పాఠ్యపుస్తకాలకు పని కల్పించాను. చదువు తప్ప వేరే లోకం లేదు...అన్నట్లుగా చదివాను. ఎక్కువ మార్కులతో పరీక్ష పాసయ్యాను. సివిల్స్ రాయలనేది నా భవిష్యత్ లక్ష్యం. ‘‘ఇప్పుడు నాకు కాళ్లు చేతులే కాదు...ఆత్మవిశ్వాసం కూడా ఉంది’’. నా భవిష్యత్ లక్ష్యాన్ని చేరుకుంటాననే నమ్మకం నాలో ఉంది. -ఆర్యస్వీ, రాజోలు