ఆరంభం అదిరింది
నిడదవోలులో జాతీయస్థాయి వాలీబాల్ టోర్నీ ప్రారంభం
దేశం నలుమూలల నుంచి 300 మంది క్రీడాకారుల హాజరు
నిడదవోలు, న్యూస్‌లైన్ :
యంగ్ మెన్స్ క్రిష్టియన్ ఆర్గనైజేషన్ (వైఎంసీఏ) ఆధ్వర్యంలో జాతీ యస్థాయి ఇంటర్ వాలీబాల్ టోర్నమెం ట్ నిడదవోలు సెయింట్ ఆంబ్రోస్ హైస్కూల్ క్రీడామైదానంలో గురువారం ప్రారంభమైంది. టోర్నీని వైఎస్సార్ సీపీ రాజ మండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డు అనంత వెంకట రమణ చౌదరి నియోజకవర్గ సమన్వయకర్త రాజీవ్‌కృష్ణతో కలసి ప్రారంభిం చారు. మూడు రోజుల పాటు జరిగే ఈ టోర్నీకి దేశం నలుమూలల నుంచి 300 మంది క్రీడాకారులు తరలివచ్చారు. తొలిరోజు 20 జట్లు తలపడ్డాయి. 50 మంది పీఈటీలు, అంపైర్లు పనిచేస్తున్నారు. పోటీల ఆర్గనైజింగ్ కమిటీ ఛైర్మ న్ ఎంఎల్ దేవసహాయం అధ్యక్షతన జరి గిన సభలో బీవీఆర్ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డెరైక్టర్ బయ్యే వెంకట్రావు, వైఎంసీఏ రీజినల్ ఛైర్మన్, హెన్రీ డొమెనిక్ కాళతూటి, వైఎంసీఏ వైస్ చైర్మన్ పీడీ రత్నరాజు పాల్గొన్నారు.
తొలిరోజు విజేతలు
తొలిరోజు ఫలితాలను గురువారం రాత్రి ప్రకటించారు. పూల్-ఎలో ముంబై జ ట్టుపై కడప, కరీంనగర్ జట్టుపై విశాఖ, కరీంనగర్‌పై ముంబై జయకేతనం ఎగు రవేశాయి. పూల్-బిలో కేరళపై విజయనగరం, చిలకలూరు పేటపై మద్రాస్ ఫిజికల్ కళాశాల, చిలకలూరిపేటపై హిందూపూర్, పూల్-సి లో కాకినాడపై చెన్నై, వరంగల్‌పై కాకినాడ, వరంగల్‌పై చందోల్ జట్లు గెలుపొందాయి. పూల్ డిలో భీమిలిపై రాజమండ్రి, కరీంనగర్‌పై భీమిలి, కరీంనగర్‌పై రాజమండ్రి జట్లు విజయకేతనం ఎగురవేశాయి.