రేపు ‘సాక్షి స్పెల్బీ’ రెండో రౌండ్
ఏలూరు సిటీ : సాక్షి, ఇండియా స్పెల్బీ సంస్థలు సంయుక్త ఆధ్వర్యంలో పాఠశాలల్లో విద్యార్థులకు ఇంగ్లిష్ స్పెల్లింగ్పై నిర్వహిస్తున్న స్పెల్బీ రెండో దశ పరీక్ష ఆదివారం జరుగనుంది. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు ఆంగ్లంపై పట్టు సాధించేలా సాక్షి ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. జిల్లావ్యాప్తంగా ప్రాథమిక స్థాయి పరీక్షలకు 27 పాఠశాలల నుంచి 1,203 మంది హాజరయ్యారు. వీరిలో రెండో దశ పరీక్షకు 272 మంది ఎంపికయ్యారు. రెండో రౌండ్ పరీక్షలు నాలుగు కేటగిరీల్లో నిర్వహిస్తారు. ఉదయం 10.15 గంటల నుంచి ప్రారంభమయ్యే స్పెల్బీ పరీక్షలు సాయంత్రం 4.15 వరకు కొనసాగుతాయి.
షెడ్యూల్ ఇలా..
సాక్షి ఇండియా స్పెల్బీ-14 రెండో దశ పోటీలు కేటగిరి-1 విద్యార్థులకు ఉ.10.15 గంటలకు, కేటగిరి-2 విద్యార్థులకు మధ్యాహ్నం 12.15 గంటలకు, కేటగిరి-3 విద్యార్థులకు మ.2.15 గంటలకు, కేటగిరి-4 విద్యార్థులకు సాయంత్రం 4.15 గంటలకు పరీక్షలు నిర్వహిస్తారు.
పరీక్షా కేంద్రం : ఏలూరు ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ సమీపంలోని భాష్యం ఇంగ్లిష్ మీడియం హైస్కూల్లో పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులు అదేరోజు ఉదయం పరీక్షా కేంద్రానికి చేరుకుని ‘సాక్షి’ టీవీలో ప్రసారమయ్యే కార్యక్రమంలో వ్యాఖ్యత చెప్పిన ఆంగ్ల పదాలను విని పరీక్ష రాయాలి. స్పెల్బీ మాస్టర్ విక్రమ్ 30 పదాలను ఉచ్చరిస్తారు. ఒక్కోపదాన్ని మూడుసార్లు పలుకుతారు. వీటిని విని స్పెల్లింగ్ రాయాలి. పరీక్షా సమయం 30 నిముషాలు.
నిబంధనలు: విద్యార్థులు వారి పాఠశాల యూని ఫాంలో పరీక్షకు హాజరుకావాలి. పెన్ లేదా పెన్సిల్, ప్యాడ్, పరీక్షలో పాల్గొనేందుకు ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలి. అల్పాహారం, భోజనం, మంచినీరు విద్యార్థులే ఏర్పాటు చేసుకోవాలి. ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు అనుమతి లేదు.
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు
ఏలూరు : సర్ సీఆర్ రెడ్డి స్కూల్, భాష్యం స్కూల్, కేకేఆర్ గౌతమ్ స్కూల్, సిద్దార్థ విద్యాలయం.
భీమవరం : సెయింట్ మేరీస్ స్కూల్, వెస్ట్ బెర్రీ స్కూల్.
తణుకు : విరంచి విద్యానితన్, రూట్స్, భాష్యం స్కూల్, ఎయిమ్ యూపీ ఇంగ్లిష్ మీడియం స్కూల్.
పాలకొల్లు : భారతీయ విధ్యాభవన్స్, ఆదిత్య స్కూల్
నరసాపురం : జే.సికిలి స్కూల్, భాష్యం లిటిల్ చాంప్స్, ఆదిత్య స్కూల్.
కొవ్వూరు : ఏఎస్ఆర్ అండ్ వీఎన్డీఏవీ సూల్, భాష్యం స్కూల్.
తాడేపల్లిగూడెం : కింబర్లీ స్కూల్, శ్రీ రమణ మహర్షి స్కూల్
జంగారెడ్డిగూడెం : ప్రతిభ స్కూల్.
ధర్మాజీగూడెం : శ్రీ విద్య స్కూల్.
దొండపూడి : సెయింట్ మేరీస్ స్కూల్.
గణపవరం : సాధన స్కూల్, విద్యాజ్యోతి స్కూల్.
పెనుగొండ : ఇన్పాంట్ జీసస్ స్కూల్.
పొలమూరు : జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు సెల్ప్బీ పరీక్షలకు హాజరుకానున్నారు.