‘పాలిటెక్నిక్’ క్రీడా పోటీలు ప్రారంభం
విద్యానగర్(గుంటూరు) : జిల్లా స్థాయి పాలిటెక్నిక్ కళాశాలల క్రీడాపోటీలు గుంటూరు రూరల్ మండలం నల్లపాడులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మంగళవారం ప్రారంభమయ్యూరుు. పోటీలను ఐటీసీ డివిజనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంజీవ్ రాంగ్రాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో విద్యార్థుల్లో నూతన ఉత్తేజం కలగటంతోపాటు స్నేహభావం పెరుగుతుందని చెప్పారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిస్తే మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయని వివరించారు.
కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.అరోజ్రాణి మాట్లాడుతూ రెండు రోజులు జరిగే ఈ పోటీల్లో 20 కళాశాలల నుంచి 400 మంది పాల్గొంటున్నారని చెప్పారు. జిల్లా స్థారుు పోటీలకు ఆతిథ్యం ఇవ్వటం ఆనందం కలిగిస్తోందన్నారు. తొలుత సంజీవ్ రాంగ్రాస్, ఇతర అతిథులు జ్యోతి వెలిగించి, శాంతి కపోతాలను ఎగురవేశారు. క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.
సంజీవ్ రాంగ్రాస్ వాలీబాల్ ఆడి పోటీలను ప్రారంభించారు. తొలిరోజు టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్, కబడ్డీ, చెస్ తదితర క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. చెస్ పోటీల్లో గుంటూరు మైనారిటీస్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి వై.హర్షసత్యదేవ్, క్రోసూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి ఎం.వెంకునాయుడు విజేతలుగా నిలిచారు. నల్లపాడు పాలిటెక్నిక్ కళాశాల పీడీ సుబ్బారావు, వివిధ కళాశాలల వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.