ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు
శ్రీరాములపల్లి (కమలాపూర్) : మండలంలోని శ్రీరాములపల్లిలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలను వరంగల్ జిల్లా గౌడ యువసేన అధ్యక్షుడు జనగాని రాజేందర్‌గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. అనంతరం రాజేందర్‌గౌడ్ మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాల ఏర్పాటుకు కృషి చేస్తానని, అందుకు గౌడ కులస్తులు సహకరించాలన్నారు. కార్యక్రమంలో గౌడ సంఘం నాయకుడు పల్లెల రాజు, కౌండిన్య యూత్ అధ్యక్షుడు జక్కు మధు, జక్కు గోపి, జనగాని సురేశ్, దూలం నిరంజన్, జనగాని మహేశ్, జనగాని శ్రీకాంత్, గుర్రం దిలీప్ తదితరులు పాల్గొన్నారు.