23 నుంచి స్కూల్ గేమ్స్ క్రీడాపోటీలు
నల్లగొండ టూటౌన్ : ఈ నెల 23 నుంచి స్కూల్గేమ్స్ క్రీడాపోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ వై.చంద్రమోహన్, ఎస్జీఎఫ్ కార్యదర్శి పుల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. 14, 17 సంవత్సరాల క్రీడాకారులకు క్రికెట్, యోగా సెలక్షన్లు, హ్యాండ్బాల్, ఖో–ఖో, కబడ్డీ తదితర పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
– 23న నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో 17 సంవత్సరాల బాలురకు క్రికెట్ పోటీలు
– 23న 14, 17 సంవత్సరాల విద్యార్థులకు నల్లగొండలోని ఇండోర్ స్టేడియంలో యోగా సెలక్షన్స్ పోటీలు
– 24న నల్లగొండలో అవుట్డోర్ స్టేడియంలో 14, 17 సంవత్సరాల బాలబాలికలకు హ్యాండ్ బాల్ సెలక్షన్స్
– 25, 26న సూర్యాపేటలోని లైలా కాలేజీలో 14, 17 సంవత్సరాల వారికి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు
– 26న హుజూర్నగర్లో ప్రభుత్వ హైస్కూల్లో 14 సంవత్సరాల బాలబాలికలకు ఖో–ఖో
పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.