స్కోరర్ వసంత్ కుమార్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) స్కోరర్ వసంత్ కుమార్ కులకర్ణి ఆకస్మికంగా మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తుది శ్వాస విడిచారు. వసంత్ 12 సంవత్సరాలుగా స్కోరర్‌గా పనిచేస్తున్నారు.
46 ఏళ్ల వసంత్ కుమార్ స్వస్థలం కర్ణాటకలోని గుల్బర్గా. ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వసంత్ కుమార్ మృతి పట్ల హెచ్‌సీఏ అధికారులు, స్కోరర్లు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.