కళలు వర్ధిల్లిన చోట యుద్ధాలు జరగవు
ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ సియాన్
సాక్షి, హైదరాబాద్: ‘‘జపాన్‌కు చెందిన ప్రఖ్యాత టైకో డ్రమ్మింగ్ సంగీతానికి భారతీయ సంప్రదాయ నృత్యం కలరుుకతో సృష్టించిన ‘చీ ఉడాక’ సంగీత నృత్య కళను తొలిసారిగా భారతదేశానికి పరిచయం చేస్తున్నందుకు గర్వపడుతున్నాం’’అని ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ సియాన్ కెల్లీ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసేందుకు తమ దేశ ప్రభుత్వం ఈ ప్రదర్శనలకు సహకారం అందిస్తోందన్నారు. కళలు వర్ధిల్లిన చోట యుద్ధాలు జరగవన్నారు. సిడ్నీకి చెందిన టైకోజ్, లింగలాయం ఇండియన్ క్లాసికల్ డ్యాన్స కంపెనీలు శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో చీ ఉడాక కళా ప్రదర్శన నిర్వహించాయి.
అంతకు ముందు సియాన్ కెల్లీ నగరంలోని ఓ హోటల్లో విలేకరులతో మాట్లాడుతూ.. చీ అంటే జపనీలో భూమి అని, ఉడాక అంటే సంస్కృతంలో నీళ్లు అన్నారు. రెండు విభిన్న సంస్కృతుల కలరుుకగా చీ ఉడాక కళ పుట్టిందన్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వ సహకారంతో తొలిసారిగా భారత్‌లో టైకోజ్, లింగలాయం డ్యాన్స కంపెనీలు 3 చోట్లలో చీ ఉడాక ప్రదర్శనలకు ఏర్పాటు చేశాయన్నారు. 19న చెన్నైలో, శనివారం హైదరాబాద్‌లో ప్రదర్శనలు ముగిశాయని, 29న ముంబైలోని జంషెడ్ బాబా థియేటర్లో ప్రదర్శన ఉంటుందన్నారు. ఈ సమావేశంలో లింగలాయం డెరైక్టర్ ఆనందవల్లి, టైకోజ్ డెరైక్టర్ అయాన్ క్లివర్త్, చీ ఉడాక నిర్మాణ లీ, శాకుహచి గ్రాండ్ మాస్టర్ రైలీ లీ పాల్గొన్నారు.