Sensex flat
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబై : ఆసియన్ మార్కెట్ల నుంచి వస్తున్న బలహీనమైన సంకేతాలతో సోమవారం స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 91 మేర పాయింట్ల నష్టంలో 29,370 వద్ద కొనసాగుతుండగా... నిఫ్టీ 28.60 పాయింట్ల నష్టంలో 9122 వద్ద ట్రేడవుతోంది. సన్ ఫార్మాకు చెందిన దాద్రా యూనిట్ ఆడిట్ లో భాగంగా 11 అబ్సర్వేషన్స్ ను అథారిటీలు చేపట్టాలని అమెరికా ఎఫ్‌డీఏ ఆదేశాలు జారీచేయగా.. సన్ ఫార్మా షేర్లు 2 శాతం మేర పడిపోతున్నాయి. కంపెనీకున్న అమెరికా సప్లయిర్స్ లో హలోల్ తర్వాత అతిపెద్ద యూనిట్ దాద్రా యూనిటే. టోరెంట్ ఫార్మాకు చెందిన రెండు ప్లాంట్స్ ను తిరిగిపరిశీలించాలని అమెరికా ఎఫ్‌డీఏ పేర్కొంది. దీంతో ఆ కంపెనీ షేర్లు కూడా ట్రేడింగ్ ప్రారంభంలో 2 శాతం నష్టపోయాయి. ఇదే సమయంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ పై ఎలాంటి అబ్సర్వేషన్స్ ను అమెరికా ఆదేశించకపోవడంతో ఆ కంపెనీ షేర్లు 2 శాతంపైగా లాభాలను ఆర్జిజిస్తున్నాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ ఫ్లాట్ గా 64.42 వద్ద ప్రారంభమైంది. భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు చెలరేగుతున్న నేపథ్యంలో చాలా ఆసియన్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడుతోంది. మరోవైపు పసిడి దూకుడుగా 193 రూపాయల లాభంలో 29,422 రూపాయల వద్ద కొనసాగుతోంది. -
స్వల్పలాభాలతో సరి
ముంబై : దేశీయ బెంచ్‌మార్కు సూచీలు శుక్రవారం స్వల్పలాభాలతో సరిపెట్టుకున్నాయి. సెన్సెక్స్ 4.55 పాయింట్ల లాభంతో 28334.25 వద్ద, నిఫ్టీ 15.15 పాయింట్ల లాభంలో 8793.55 వద్ద ముగిశాయి. వరుసగా మూడో సెషన్లోనూ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోలు 0.7-2.9 శాతం లాభపడ్డాయి. ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంకు, లుపిన్, హెచ్డీఎఫ్సీ, ఏసియన్ పేయింట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ మాత్రం 0.6-2 శాతం డౌన్ అయ్యాయి. మార్కెట్లకు నిరాశకలిగిస్తూ సెంట్రల్ బ్యాంకు వడ్డీరేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచుతూ ప్రకటించిన అనంతరం కూడా మార్కెట్లు కొంత పునరుద్ధరించుకున్నాయి. వరుసగా మూడో వారాంతంలోనూ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అటు ఆసియన్ షేర్ల బూస్ట్ దేశీయ మార్కెట్లకు కొంత కలిసివచ్చింది. డాలర్‌తో రూపాయి మారకం 0.05 పైసలు లాభపడి 66.80 వద్ద ముగిసింది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 123 రూపాయలు పడిపోయి రూ.28,966గా నమోదైంది. శుక్రవారం మాదిరిగానే నిన్నటి ట్రేడింగ్‌లో కూడా స్టాక్స్ మార్కెట్లు స్వల్పంగా లాభపడ్డాయి.