బదిలీలు ఎప్పుడో..
- ఉద్యోగుల్లో టెన్షన్.. టెన్షన్
- ఇంకా ప్రకటించని ప్రభుత్వం
- నెల రోజుల్లో పూర్తరుుతే మేలు
- విద్యా సంవత్సరం ప్రారంభమైతే కష్టం..
- డిప్యూటేషన్లపై గుర్రుగా ఉన్న ఉద్యోగులు
అవసరం అనుకున్న చోటకు అధికారుల బదిలీలు జరుగుతూనే ఉంటారుు. ఎటొచ్చీ ఉద్యోగులు బదిలీ కావాలని కోరుకుంటే మాత్రం కుదరదు. ఇతర సమస్యలు చెప్పి బదిలీ కావడానికి చట్టం ఒప్పుకోదు.
సాధారణ బదిలీల కోసం సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఎప్పుడిస్తుందా అని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో దాదాపు రెండేళ్లుగా బదిలీలు నిలిచిపోరుున విషయం విదితమే. ఏప్రిల్ ఆఖరు లేదా మే నెల మొదట్లో సాధారణ బదిలీ విషయమై ప్రభుత్వం ప్రకటన చేయడం ఆనవారుతీ. ఈ తతంగమంతా నెల రోజుల్లో పూర్తరుుతే ఉద్యోగులు వారి పిల్లలను బదిలీ అరుున చోట విద్యా సంస్థల్లో చేర్చుకోవడానికి, ఇతర ప్రత్యామ్నాయూలు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది.
హన్మకొండ అర్బన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో సివిల్ సర్వీసు అధికారులు మినహా ఇతర స్థాయి అధికారుల పంపకాలు పూర్తి కాలేదు. దీనికి ప్రభుత్వం గడువు పొడిగించడంతో లెక్కలు ఇప్పట్లో తేలేట్టు లేవు. ఒకవేళ ఇదే కారణంతో సాధారణ బదిలీలపై ప్రభుత్వం నిషేధం ఎత్తివేయకుండా ఉంటుందా అన్న ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. సాధారణ బదిలీల విషయంలో ప్రభుత్వం నిషేధం ఉన్నా అత్యవసరాలు.. పరిపాలనా సౌల భ్యం పేరుతో సర్దుబాట్లకు అవకాశం కల్పించింది. దీంతో అవసరం అనుకున్న చోటకు అధికారుల బది లీలు జరుగుతూనే ఉన్నారుు. ఎటొచ్చీ ఉద్యోగులు బదిలీ కావాలని కోరుకుంటే మాత్రం కుదరదు.. ఇతర సమస్యలు చెప్పి బదిలీ కావడానికి చట్టం ఒప్పుకోదు. దీంతో వందల మంది ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.
కొందరికే ‘సౌలభ్యం’
బదిలీలపై నిషేధం ఉన్నప్పుడు ఉన్నతాధికారులు పరిపాలనా సౌలభ్యం పేరుతో చేసే బదిలీల్లో కొం దరు ఉద్యోగులకు మాత్రమే న్యాయం జరుగుతోం ది. మారుమూల, ప్రాధాన్యం లేని ప్రాంతంలో పని చేసేవారికి బయటపడే మార్గం ఉండటం లేదు. జిల్లాలో ఇదే విషయం చర్చనీయాంశంగా మారింది.
ఆర్ఐ పోస్టుల కోసం..
ప్రస్తుతం రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్ స్థాయికి సంబంధించి ఆర్ఐ పోస్టు విషయంలో తీవ్ర పోటీ నెలకొంది. నిబంధనల ప్రకారం సీనియర్ అసిస్టెంట్ నుంచి డీటీగా పదోన్నతి పొందడానికి సదరు ఉద్యోగి రెండేళ్ల ఆర్ఐ పీరియడ్ పూర్తి చేసి ఉండాలి. అయితే జిల్లాలోని కొన్ని మండలాల్లో ఆర్ఐ పోస్టుల్లో ఉన్నవారు ఏళ్ల తరబడి పాతుకుపోయి ఉన్నారు. మరికొందరు మండలం మారినా ఐదేళ్లకుపైగా ఆర్ఐలుగా కొనసాగుతున్న వారున్నారు. ఉదాహరణకు.. ఆర్ఐ పీరియడ్ పూర్తయిన వారు.. దీర్ఘకాలంగా కొనసాగుతున్న వారిని మండలాలవారీగా పరిశీలిస్తే.. వరంగల్, పర్వతగిరి, జఫర్‌గఢ్, మంగపేట, పరకాల, రేగొండ, గణపురం, భూపాలపల్లి, తాడ్వాయి, ములుగు, వెంకటాపుర్, నర్సంపేట, దుగ్గొండి, గూడూరు, కొత్తగూడ, చెన్నారావుపేట, ఖానాపురం, మహబూబాబాద్ డివిజన్లో దాదాపు మొత్తం మండలాలు, జనగామ, లింగాలగణపురం, రఘునాథపల్లి, చేర్యాల, నర్మెట, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లో ఉన్న కొందరు ఏఆర్‌ఐలు, కొందరు ఎమ్మారైలు ఈ జాబితాలో ఉన్నారు. సాధారణ బదిలీలు లేకపోవడంతో అధికారులు వీరిని కదిలించడంలేదు.
అయితే 2013 సాధారణ బదిలీల సమయంలో చాలామంది పైరవీల వల్ల ఆర్ఐ పోస్టుల్లో కొనసాగుతున్నారనే ఆరోపణలున్నారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖలో దీనిపై తీవ్ర చర్చ నడుస్తోంది. బదిలీలకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిన సమయంలో స్థానిక నేతలతో ఉన్నతాధికారులకు చెప్పించడం, లేదా అర్డీఓలతో సిఫార్సు లేఖలు ఇవ్వడం షరా మామూలుగా మారుతోంది. వెరసి నిజాయితీగా ఆర్ఐ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న వారికి అవకాశం రావడం లేదు. పదోన్నతుల విషయానికి వచ్చేసరికి తప్పనిసరి కావడంతో నిబంధనలు పక్కన పెట్టి వారిని ఆర్ఐ పోస్టుకు పంపాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
వీఆర్వోలదీ అదే తీరు..
ఇక వీఆర్వోల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. హ న్మకొండ లాంటి మండలాలకు 2009లో వచ్చిన వీ ఆర్వోలు ఇప్పటివరకు కదల్లేదు. ఇంకా చెప్పాలం టే కాస్త ‘రెవెన్యూ’ ఉన్న గ్రామాల్లో వీఆర్వోలు కదలిక లేకుండా ఉన్నారు. ఏళ్ల తరబడి ఒకేచోట పని చే య డం వల్ల కూడా కొన్నిచోట్ల వీఆర్వోల పరిస్థితి ఉన్నతాధికారులకు ఇబ్బందిగా మారుతోంది. ఇలాంటి వారిలోనే కొందరు అక్రమ వసూళ్లు, ఏసీబీ దాడు లు, భూముల అన్యాక్రాంతం, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారి జాబితాలో చేరుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో మారుమూల ప్రాంతాల్లో పనిచేసే వారికి మంచి ప్రదేశాలకు వచ్చే అవకాశం తగ్గుతుంది కూడా.
త్వరలో ఉత్తర్వులు
బదిలీలపై విధి విధానాలను ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసినట్లు సమాచారం. ఉత్తర్వులు వెలువడిన నాటి నుంచి ఈ నెలాఖరు వరకు సాధారణ బది లీలకు అవకాశాలు ఉంటాయని సమాచారం.