కేరళలో ఆంధ్రా అయ్యప్ప భక్తులపై దాడి
కేరళ: ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన అయ్యప్ప భక్తులపై కేరళ రాష్ట్రానికి చెందిన వారు దాడికి పాల్పడిన సంఘటన గందరగోళానికి కారణమైంది. కేరళ నుంచి వస్తున్న శబరి ఎక్స్‌ప్రెస్‌లో తెలుగువారిపై కేరళ రైల్వే సోలీసుల సహాయంతో దాడికి పాల్పడినట్టు తెలిసింది. ఈ ఘటనతో కేరళలోని షోర్నూర్ స్టేషన్ వద్ద రెండుగంటలకు పైగా శబరి ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది.
ఆంధ్రా అయ్యప్ప భక్తులను టార్గెట్‌గా చేసుకుని షోర్నూర్ వద్ద శబరి ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లతో దాడి చేశారన్నారు. రాళ్లదాడిపై ఫిర్యాదుచేసినా పోలీసులు పట్టించు కోలేదన్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు పక్షపాతంగా వ్యవహరించారని అయ్యప్ప భక్తులు ఆరోపించారు.
దాడికి నిరసనగా అయ్యప్ప భక్తులు నిరసన తెలుపుతూ ట్రాక్‌పై బైఠాయించారు. అయ్యప్ప భక్తులను శాంతింప చేసేందుకు రైల్వే అధికారులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. తమపై దాడి చేయడంపై అయ్యప్ప భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.