ఉత్తమ తెలుగు చిత్రం 'నా బంగారు తల్లి'
న్యూఢిల్లీ: 61వ జాతీయ సినిమా అవార్డులను బుధవారం ప్రకటించారు. ఆనంద్ గాంధీ దర్శకత్వంలో నిర్మించిన 'షిప్ ఆఫ్ తెస్యుస్' ఉత్తమ చిత్రంగా ఎంపికయింది. 'భాగ్ మిల్కా భాగ్' ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా అవార్డు దక్కించుకుంది. 'షహీద్' సినిమాను రూపొందించిన హన్సల్ మెహతా ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యాడు.
'షహీద్' నటించిన రాజ్‌కుమార్, 'పెరారియాతవర్'లో నటించిన సూరజ్ వెంజారుమూడు సంయుక్తంగా ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు. 'లియర్ డీస్'లో నటించిన గీతాంజలి థాపా ఉత్తమ నటి అవార్డు దక్కించుకుంది. 'జోలీ ఎల్ఎల్ బీ' లో నటించిన సౌరభ్ శుక్లా ఉత్తమ సహాయ నటుడిగా ఎంపికయ్యారు.
ప్రాంతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా 'నా బంగారు తల్లి' ఎంపికయింది. జాతీయ ఉత్తమ నేపథ్య సంగీత అవార్డు కూడా ఈ సినిమాకు దక్కింది. శాంతారాం మొయిత్రా సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో నటించిన అంజలి పాటిల్‌కు ప్రత్యేక ప్రశంస దక్కింది. 'సినిమాగా సినిమా'కు ఉత్తమ సినిమా పుస్తక అవార్డు లభించింది.