చికిత్సపొందుతూ రిమాండ్ ఖైదీ మృతి
గుంటూరు: గుంటూరు సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్న ఖైదీ షేక్ నజీర్ (52) అస్వస్థతకు గురై స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆస్పత్రి ఔట్ పోస్టు సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రం తాడేపల్లికి చెందిన షేక్ నజీర్ రైల్వేలో 4వ తరగతి ఉద్యోగిగా నల్లపాడు రైల్వేస్టేషన్ లో పనిచేసేవాడు.
రెండు నెలల కిందట నల్లపాడు రైల్వేస్టషన్ వద్ద మూగ యువతిపై అత్యాచారం చేసి హత్యచేసిన ఘటనలో ప్రధాన నిందితుడు. ఈ కేసులో అతడు సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. క్యాన్సర్‌తో బాధపడుతున్న అతడు అస్వస్థతకు గురవడంతో జైలు పోలీసులు గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.