రైలు ప్రయాణికులకు బీమా అవకాశం ఉందా?
ప్రశ్నోత్తరాల సమయంలో పొంగులేటి ప్రస్తావన
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే శాఖపై భారం తగ్గేలా ఏవైనా బీమా కంపెనీల భాగస్వామ్యంతో రైలు ప్రయాణికులకు ప్రమాద బీమా కల్పించే యోచన ఏదైనా ఉందా? అంటూ ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కేంద్రాన్ని సోమవారం ప్రశ్నించారు.
అలాంటి సౌకర్యం లేనిపక్షంలో ప్రమాదాల్లో ప్రాణాలు, సామాన్లు కోల్పోయిన ప్రయాణికులకు పరిహారం చెల్లించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలంటూ ఆయన లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించారు. దీనికి కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు సమాధానమిస్తూ అలాంటి యోచనేదీ ప్రభుత్వానికి లేదని వివరించారు. బీమా అంశంతో సంబంధం లేకుండా ప్రస్తుతం పరిహారం అందజేస్తున్నట్టు తెలిపారు.