వెయ్యి ఇస్తేనే వ్యవసాయ పట్టా!
టేకులపల్లి (ఖమ్మం జిల్లా) : పోడు వ్యవసాయ పట్టాలను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుంటే రెవెన్యూ అధికారులు మాత్రం గిరిజనుల నుంచి అన్యాయంగా డబ్బులు వసూలు చేస్తున్న సంఘటన శనివారం మండలంలో వెలుగు చూసింది. మండల పరిధిలోని బోడు పంచాయతీ మొక్కంపాడు తండాకు, పెట్రాంచెలక స్టేజీ, పెట్రాంచెలక గ్రామాలకు చెందిన బాధిత గిరిజన రైతులు తెలిపిన వివరాల ప్రకారం..బోడు వీఆర్ఓ గజేందర్ ఒక్కో పోడు పట్టాకు వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నాడని, డబ్బులు ఇచ్చినవారికి మాత్రమే పట్టా ఇస్తున్నాడని, లేకపోతే ఇవ్వడం లేదని వెల్లడించారు. ఇప్పటికే మూడు గ్రామాల్లో 150కి పైగా పట్టాలకు డబ్బులు వసూలుల చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ విషయంపై అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు.