మండుటెండలో మహిళా పోలీసులు
అమరావతి (గుంటూరు రూరల్) : మండుటెండలో మహిళా పోలీసులు సోమవారం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీఐపీ ఘాట్ మెట్లపై డ్యూటీ చేస్తున్న పోలీసులు భానుడి తాపానికి ఉక్కిరిబిక్కిరయ్యారు. కనీసం టెంట్లు కూడా లేకపోవడంతో నడి ఎండలోనే విధులు నిర్వర్తించాల్సి వస్తోందని ఆవేదన చెందారు. ఎండ నుంచి రక్షణ పొందేందుకు చీర కొంగులు, కర్చీఫ్‌లను తలపై కప్పుకున్నారు. డ్యూటీ తప్పని సరికాంటంతో ఎర్రని ఎండలో అల్లాడిపోయారు.