ఆశలు తీర్చే అభిషేకం
పంచామృతంతో అభిషేకం.. ఆరోగ్య ప్రాప్తి. పాలతో అభిషేకం.. దీర్ఘాయు ప్రాప్తి. పెరుగుతో అభిషేకం.. సత్సంతాన ప్రాప్తి. గంధంతో అభిషేకం.. లక్ష్మీకటాక్ష ప్రాప్తి. స్వామి దర్శనం చేతనే వివాహయోగం. వివాహమైన వారికి దాంపత్య జీవితం సుఖసంతోషాలమయం. పదిహేనువేల మంది దేవతలు తరలి వచ్చి ఆరాధించిన స్వామి పల్లికొండేశ్వరుడు. కొలువుదీరిన నేల సురుటపల్లి.
సాధారణంగా దాదాపు అన్ని శివాలయాల్లోనూ శివుడు లింగాకారంలో దర్శనమిస్తాడు. కొన్నిచోట్ల ధ్యానముద్రలో ప్రశాంతంగా కూర్చున్న భంగిమలో శివయ్యను దర్శించుకుంటాం. కానీ, పార్వతీదేవి ఒడిలో ఆదమరచి నిద్రిస్తున్న భంగిమలో ఉన్న శివుడి విగ్రహాన్ని భక్తజనం ఎక్కడా చూసి ఉండరు. పద్నాలుగు అడుగుల ఎత్తులో ఈ అరుదైన శయన శివుడి దర్శనం మనకు చిత్తూరు జిల్లాలోని సురుటపల్లి గ్రామంలోని పల్లికొండేశ్వర ఆలయంలో లభిస్తుంది. చుట్టూ బ్రహ్మ విష్ణువులు, సూర్యచంద్రాదులు, నారద తుంబురులు, ఇంద్రుడు, కుబేరుడు, మార్కండేయుడు, అగస్త్య, పులస్త్య, వాల్మీకి, విశ్వామిత్రాది మహర్షులు కొలువు తీరి ఉండగా శివుడు సర్వమంగళాదేవి (పార్వతీదేవి) ఒడిలో తలపెట్టుకుని నిద్రిస్తున్న భంగిమలో భక్తులకు దర్శనమిచ్చే దృశ్యం కన్నులపండుగగా ఉంటుంది.
బుక్కరాయలు నిర్మించిన ఆలయం
తిరుపతి- చెన్నై జాతీయు రహదారిలో అరుణానది ఒడ్డున ఈ ఆలయుం కొలువుదీరి ఉంది. భక్తుల పాలిట కల్పతరువుగా భావించే ఈ ఆలయూన్ని 1344-47 మధ్యకాలంలో విజయునగరాధీశుడైన హరిహర బుక్కరాయులు నిర్మింపజేశారు. 1833లో శ్రీకాళహస్తి సంస్థానాధీశులైన రాజావారు జీర్ణోద్ధరణ చేసినట్లు ఆలయు కుడ్యాలపై శాసనాలు ఉన్నాయి. ఈ ఆలయు ప్రాశస్త్యాన్ని గుర్తించిన శ్రీ కంచి కావుకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర చంద్రశేఖర సరస్వతి స్వామి వారు 1979లో ఇక్కడ వుహాకుంభాభిషేకం నిర్వహించారు. ఆ సందర్భంలో చంద్రశేఖర సరస్వతి స్వావుుల వారికి పరవుశివుడు దర్శన భాగ్యం కలిగించడంతో ఆయున ఈ ఆలయుంలోనే గడిపినట్లు స్వయుంగా పేర్కొన్నారు.
గరళకంఠుడు సేదదీరిన నేల
క్షీరసాగర మథనంలో హాలాహలం పుట్టుకు వచ్చినప్పుడు భీతావహులైన సురాసురులు లోకాలను కాపాడాలంటూ పరమేశ్వరుడికి మొరపెట్టుకున్నారు. త్రిలోక రక్షణాదక్షుడైన శివుడు ఆ హాలాహలాన్ని స్వీకరించాడు. గరళం కడుపులోకి వెళ్లకుండా పార్వతీదేవి పతి గొంతును నొక్కిపట్టి ఉంచింది. దీంతో ఆ విషం గొంతులోనే ఉండిపోయి ఆ భాగమంతా నీలిరంగులోకి మారింది. విషప్రభావంతో సొమ్మసిల్లిన శివుడు పార్వతీ దేవి ఒడిలో శయనించాడు. నారదుడు ముల్లోకాలకూ ఈ సమాచారం చేరవేశాడు. అన్ని సురగణాలకూ ఆ దృశ్యం సురటపల్లిలో కనిపించింది. నీలకంఠుడికి స్వస్థత చేకూర్చాలని సురగణమంతా సురటపల్లికి చేరింది. అలా తరలి వచ్చిన దేవగణాన్ని పరమేశ్వరుడు విశ్రాంతి తీసుకుంటున్నాడని నందీశ్వరుడు నిలువరించాడు. విషయం తెలుసుకున్న శివుడు మేలుకుని దేవతలకు దర్శనభాగ్యం కలిగించాడు. దేవతలంతా ఆనందంతో నృత్యాలు చేశారు. సప్తరుషులు, దేవతలు పరమేశ్వరుణ్ణి కృష్ణ పక్ష త్రయోదశి నాడు దర్శించుకున్నార ని... ఈ కథనాన్ని శివపురాణం చెబుతోంది. కృష్ణ పక్ష త్రయోదశి శనివారం మహాప్రదోష వేళలో దేవతలు పళ్లికొండేశ్వర స్వామి దర్శనానికి వస్తారని, ఆరోజు దర్శనానికి వెళితే చాలు సమస్త దేవతల కరుణాకటాక్షాలను అందుకోవచ్చని భక్తుల నమ్మకం. శివుడు హాలాహలాన్ని మింగి సొమ్మసిల్లిన వేళ పదిహేనువేల మంది దేవతలు ఈ స్థలానికి వేంచేసినట్లు శివపురాణం చెబుతోంది. ఇక్కడ పరమేశ్వరుడిని నీలకంఠుడిగా, శ్రీ కంఠ, నంజుండస్వామిగానూ ఈ పళ్లికొండేశ్వర స్వామిగా భక్తులు స్తుతిస్తారు.
రామయ్య చేతితో..
రావణ సంహారణానంతరం బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడానికి శ్రీరాముడు ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించాడని, రామాయణం రచించిన వాల్మీకి కూడా ఇక్కడ శివలింగ ప్రతిష్ఠాపన జరిపాడని చెబుతారు. వాల్మీకి ప్రతిష్ఠించిన శివలింగాన్ని వాల్మీకేశ్వరస్వామిగా పిలుస్తారు.
దాంపత్య దక్షిణావుూర్తి ఓ ప్రత్యేకత
ఈ ఆలయుంలో దంపతీ సమేతుడైన దక్షిణావుూర్తి దాంపత్య దక్షిణావుూర్తిగా వెలుగొందుతున్నాడు. దంపతీ సమేతుడై కటాక్షించడం వల్ల ఈ స్వామి దర్శనం సర్వసౌఖ్యాలకు సోపానంగాను, గురు దక్షిణావుూర్తి కావున సర్వలోకాలకు జ్ఞానప్రదాయకుడిగా కీర్తిస్తుంటారు. ఈ ఆలయుంలోని వాల్మీకేశ్వరాలయు ప్రాకారంలో దక్షిణ భాగంలో కొలువై ఉన్న ఈ స్వామివారిని భక్తులు విరివిగా సేవిస్తున్నారు. శివుడి అరవై నాలుగు రూపాలలో దక్షిణావుూర్తి రూపం ఒకటి. ఈయున ఈ ఆలయుంలో వృషభవాహనారూఢుడై వావుభాగం(ఎడవు భాగం)లో గౌరీదేవి సమేతుడై ఉన్నందువల్ల దాంపత్య దక్షిణావుూర్తిగా పూజలందుకుంటున్నాడు.
దేశంలోనే ఏకైక ప్రదోష క్షేత్రం
సురటపల్లిలోని ఈ శైవక్షేత్రం దేశంలోనే ఏకైక ప్రదోష క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ అతి ముఖ్యమైనది శని ప్రదోష పూజ. శని పీడనతో బాధపడేవారు శనివారంనాడు వచ్చే కృష్ణపక్ష త్రయోదశి రోజున ప్రదోష వేళలో ఇక్కడ ప్రత్యేక పూజలు జరుపుతారు. సూర్యాస్తమయానికి గంటన్నర ముందు నుంచి గంటన్నర తర్వాత వరకు గల మూడుగంటల కాలాన్ని ప్రదోషవేళ అంటారు. ఈ ప్రదోషవేళలో జరిగే ప్రత్యేక పూజల్లో భక్తులు అసంఖ్యాకంగా పాల్గొంటారు. అలాగే, ప్రతి గురువారం దక్షిణామూర్తి చెంత భక్తుల రద్దీ ఎక్కువ. ఇక్కడ ఏడు వారాల పాటు నిమ్మచెక్కలో ఆవునెయ్యి పోసి దీపారాధన చేస్తే అన్ని సమస్యలూ తొలగి సుఖసంతోషాలతో జీవిస్తారని భక్తుల నమ్మకం.
ఈ ఆలయం రోజూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ప్రదోష పూజలు జరుగుతాయి. ఈ ఆలయంలో ప్రవేశించిన భక్తులు ముందు మరకతాంబిక, వాల్మీకేశ్వరులను దర్శించుకొని ఆ తర్వాత మహాదేవుని దర్శనానికి వెళతారు. - గోల్కొండ ఢిల్లీ బాబు నాగలాపురం, చిత్తూరు జిల్లా, సాక్షి
ప్రత్యేకతలు వురకతాంబిక
ఈ ఆలయుంలోని వుూలస్థాన దేవతలలో ప్రధాన అంశ వురకతాంబిక అవ్మువారు. ఈమె సిరిసంపదలను ఇస్తుందని నిత్యసంపత్కరీ అని స్తుతిస్తుంటారు.
స్వయుంభువు వాల్మీకేశ్వరస్వామి
వుూలస్థాన దేవతల్లో స్వయుంభువు వాల్మీకేశ్వరస్వామికి ప్రత్యేకత ఉంది. స్వయుంభువు లింగక్షేత్రాన్ని దర్శించడం వేరుు వూనుష ప్రతిష్టా లింగాలను దర్శించినంత ఫలితాన్ని ఇస్తుందన్న నవ్ముకంతో భక్తులు స్వామిని సేవిస్తున్నారు.
పూర్ణపుష్కల సమేత అయ్యుప్ప
అపరబ్రహ్మచారిగా ప్రఖ్యాతి గడించిన అయ్యుప్ప ఈ ఆలయుంలో పూర్ణ, పుష్కల దేవేరులతో దర్శనమివ్వడం చూపరులను ఆశ్చర్యచకితులను చేస్తుంది. కలియుుగాన బ్రహ్మచారి అరుున అయ్యప్పకు త్రేతాయుుగంలో ఇద్దరు దేవేరులు ఉండేవారని ఈ విగ్రహం ద్వారా తెలుస్తున్నది. వురో అందమైన విగ్రహం ఏకపాద త్రివుూర్తి. బ్రహ్మ, విష్ణు, వుహేశ్వరులు ఒకే పాదంపై ఉండటం విశేషం.
ఓ చేతిలో అగ్నిని పూని వుూడు శిరస్సులు, వుూడు హస్తాలతో జ్వరహరవుూర్తిగా దర్శనమిస్తున్నాడు శివుడు. ఈ స్వామిని మిరియూల పొడి కలిపిన నీటితో అర్చిస్తే ఎంతటి విషజ్వరమైనా హరించుకుపోతుందని ప్రచారం. వూనవ కపాలాన్ని చేత బూని నిలుచొని ఉన్న కపాల హస్త విష్ణువును ఆలయు పడవుర ప్రాంతాన దర్శించవచ్చు. మరో 84 సుందర శిలావిగ్రహాలను ఈ ఆలయుంలో దర్శించుకోవచ్చు.
సురుటపల్లికి వెళ్లే దారి
తిరుపతి నుంచి 73 కి.మీటర్లు, చెన్నై నుంచి 68 కి.మీటర్ల దూరం. ఈ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో సురుటపల్లి చేరుకోవచ్చు. తిరుపతి నుంచి సత్యవేడు వెళ్లే బస్సులలో సురుటపల్లికి చేరుకోవచ్చు. తెలుగురాష్ట్రాల నుంచి భక్తులు తిరుపతికి రైలులో చేరుకొని, అక్కడ నుంచి బస్సులలో సురుటపల్లి చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం తిరుపతిలో ఉంది. సురుటపల్లి చిన్న గ్రామం కాబట్టి ఇక్కడ బస సదుపాయాలు లేవు.