ఆకాంక్ష, సిద్ధాంత్లకు టైటిల్స్
టెన్నిస్ టోర్నమెంట్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) గ్రేడ్-4 టెన్నిస్ టోర్నమెంట్లో సిద్ధాంత్, ఆకాంక్ష విజేతలుగా నిలిచారు. ఎల్బీ స్టేడియంలోని శాట్స్ టెన్నిస్ కాంప్లెక్స్‌లో శనివారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో సిద్ధాంత్ 6-1, 6-4తో ధ్రువ్ సునీశ్పై గెలుపొందగా... ఆకాంక్ష 2-6, 7-5, 6-0తో శివాని అమినేనిపై విజయం సాధించి చాంపియన్లుగా నిలిచారు. అంతకుముందు జరిగిన బాలుర సెమీఫైనల్లో ధ్రువ్ 6-7 (5), 6-2, 7-6 (3)తో నితిన్ కుమార్‌పై, సిద్ధాంత్ 6-1, 6-4తో సునీల్ జగ్త్యానిపై నెగ్గారు.
బాలికల విభాగంలో ఆకాంక్ష 6-4, 6-1తో శివాని స్వరూప్‌పై విజయం సాధించింది. బాలికల డబుల్స్ విభాగంలో హర్షసారుు- వైదేహి జోడి 6-4, 7-6తో ఆకాంక్ష- ఆర్జ చక్రభర్తిపై గెలుపొంది టైటిల్‌ను దక్కించుకుంది. బాలుర డబుల్స్ విభాగంలో సునీల్ జగ్త్యాని- అలెక్స్ సోలెంకి జోడి 6-2, 6-2తో సిద్ధాంత్- ధ్రువ్ జంటపై నెగ్గి చాంపియన్లుగా నిలిచారు.
డబుల్స్ సెమీఫైనల్ ఫలితాలు
బాలురు: సునీల్- అలెక్స్ సోలెంకి జోడి 6-3, 6-3తో రోహిత్- కై వల్య జంటపై, సిద్ధాంత్-ధ్రువ్ జోడి0-6, 6-3తో మేఘ్ భార్గవ్- పరీక్షిత్ సోమనిపై గెలుపొందారు.
బాలికలు: ఆకాంక్ష- ఆర్జ చక్రభర్తి జోడి 6-3, 6-4తో శివాని- లాస్య పట్నాయక్ జంటపై, హర్షసారుు- వైదేహి జోడి 6-4, 4-6, 10-8తో ఆనంద్ ముదళియార్- దేదీప్య జంటపై నెగ్గారు.