జీవోలో తెల్లకాగితం!!
- సంగపూర్ పర్యటనకు రూ.13 లక్షలు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ జారీ చేసిన జీవో విచిత్రం
హైదరాబాద్: సింగపూర్ తరహా ఆర్థికాభివృద్ధి మండలిని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం అక్కడ మండలి ఏర్పాటుపై అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీ.వీ.రమేశ్, ప్రణాళికా శాఖ అధికారితో పాటు మరో ఇద్దరు కన్సల్టెంట్లను సింగపూర్ పంపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 13 నుంచి 15 వరకు జరిగే ఈ పర్యటన కోసం ఆర్థిక శాఖ శుక్రవారం రూ.13 లక్షలను విడుదల చేసింది. ఇందుకు సంబంధించి జారీ చేసిన జీవోలో తెల్లకాగితం ఉంచడం గమనార్హం.