వసతి గృహంలోని బాలికకు పాముకాటు
నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని కోవూరు మండలంలోని బాలికల వసతి గృహంలో పదోతరగతి చదువుతున్న సుమతి(15) అనే విద్యార్థి పాము కాటుకు గురైంది. వివరాలు.. ఈ రోజు(ఆదివారం) తెల్లవారుజామున బాలిక కాలుకు పురుగు కుట్టిందేమో అని భావించి, పట్టించుకోలేదు. కానీ ఉదయం నుంచి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆమెను వసతిగృహం సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. బాలికను పరిశీలించిన ఆస్పత్రి వర్గాలు బాలికను పాము కరించిందని నిర్ధారించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.