ఎస్కేయూ సాఫ్ట్బాల్ జట్టు ఎంపిక
ఎస్కేయూ : ఆలిండియా ఇంటర్ వర్సిటీ, సౌత్ జోన్ ఇంటర్ వర్సిటీ సాఫ్ట్బాల్ టోర్నీలు చెన్నైలోని ఎంజీ యూనివర్సిటీలో ఈనెల 28 నుంచి 31 వరకు జరగనున్నాయి. ఇందులో ప్రాతినిధ్యం వహించే ఎస్కేయూ సాఫ్ట్బాల్ జట్టును ఎంపిక చేసినట్లు వర్సీటీ క్రీడా కార్యదర్శి డాక్టర్ బి.జెస్సీ తెలిపారు.
ఎంపికైన క్రీడాకారులు : ఈ. మహేష్ , ఏ.శ్యాం, ఎం.చిరంజీవి, ఎం. మహేంద్ర (ఎస్కేయూ క్యాంపస్ కళాశాల), సి. నాగేంద్ర, టి. శివరాజు, ఎం. జగదీష్ (ఎస్ఎస్బీఎన్ కళాశాల), కే. కార్తీక్, కుళ్లాయి స్వామి, డి. అనిల్ కుమార్ (ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గుంతకల్లు), బి.కార్తీక్ (ఆర్ఐఏఎస్ డిగ్రీ కళాశాల, అనంతపురం), వై.మల్లికార్జున, బి.రాజశేఖర్ ( ఆర్ట్స్ కళాశాల, అనంతపురం), కే.లోకేష్ (పీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పెనుకొండ), టి.సుధీర్ కుమార్ రెడ్డి (పీఆర్ఆర్, గుత్తి ).